Homeటాప్ స్టోరీస్నోటా మూడు రోజుల వసూళ్లు

నోటా మూడు రోజుల వసూళ్లు

vijay devarakonda's NOTA 1st Weekend Collectionsవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన రాజకీయ నేపథ్య చిత్రం నోటా మూడు రోజుల్లో 9 కోట్లకు పైగా షేర్ సాధించింది . అయితే ఈ సినిమాకు 25 కోట్ల షేర్ రావాలి , కానీ ఆ షేర్ మాత్రం వచ్చేలా కనిపించడం లేదు . అక్టోబర్ 5 న విడుదలైన నోటా చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది దాంతో కలెక్షన్లు అంతగా రావడం లేదు కాకపోతే విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో ఈమాత్రం వసూళ్లు వచ్చాయి . తెలుగు , తమిళ బాషలలో రూపొందిన నోటా చిత్రం బయ్యర్ల ని నట్టేట ముంచేలా ఉంది . 25 కోట్ల బిజినెస్ జరుగగా ఇప్పటివరకు 9 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది అంటే మరో 16 కోట్ల షేర్ రాబట్టాలి అప్పుడే బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్తారు . కానీ పరిస్థితి చూస్తుంటే మరో నాలుగు కోట్లు కూడా వచ్చేలా లేదు ఎందుకంటే అక్టోబర్ 11 న ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అవుతోంది . ఆ సినిమా వచ్చాక నోటా థియేటర్ లన్నీ ఖాళీ అవ్వడం ఖాయం . ఇప్పటివరకైతే 9 కోట్ల 25 లక్షల షేర్ తెచ్చిపెట్టింది నోటా . ఈరోజు 8 వ తేదీ ఇక నోటా కు మిగిలింది రెండు రోజులు మాత్రమే ! ఆ రెండు రోజుల్లో 2 కోట్లు వస్తే గొప్పే !

ఇక ఏరియాల వారీగా నోటా సాధించిన షేర్ ఇలా ఉంది .
తెలంగాణ – 3 . 23 కోట్లు
సీడెడ్ – 96 లక్షలు
కృష్ణా – 47 లక్షలు
గుంటూరు – 61లక్షలు
వెస్ట్ – 32 లక్షలు
ఈస్ట్ – 52 లక్షలు
ఉత్తరాంద్ర – 80 లక్షలు
నెల్లూర్ – 29 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 80 లక్షలు
ఓవర్ సీస్ – 1.25 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా – 9. 25 కోట్లు

- Advertisement -

English Title: vijay devarakonda’s NOTA 1st Weekend Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All