Homeటాప్ స్టోరీస్విజయ్-వంశీ కాంబోను అనౌన్స్ చేసిన దిల్ రాజు

విజయ్-వంశీ కాంబోను అనౌన్స్ చేసిన దిల్ రాజు

విజయ్-వంశీ కాంబోను అనౌన్స్ చేసిన దిల్ రాజు
విజయ్-వంశీ కాంబోను అనౌన్స్ చేసిన దిల్ రాజు

తమిళ స్టార్ హీరో విజయ్ బాక్స్ ఆఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కోలీవుడ్ లో వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తూ దూసుకుపోతున్నాడు విజయ్. గత కొన్నేళ్లుగా విజయ్ తెలుగు మార్కెట్ కూడా ఇంప్రూవ్ అయింది. 10 కోట్ల మార్కెట్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో సృష్టించుకున్నాడు థళపతి. ఈ ఏడాది మాస్టర్ తో సూపర్ హిట్ కొట్టిన విజయ్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో బీస్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే.

ఈ సినిమా ఫస్ట్ లుక్ కు విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. పూజ హెగ్డే బీస్ట్ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 2022 సమ్మర్ కు బీస్ట్ ను విడుదల చేయనున్నాడు. ఇదిలా ఉంటే విజయ్ 66వ సినిమా గురించి బోలెడన్ని రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ తెలుగు డెబ్యూ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.

- Advertisement -

దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ప్యాన్ ఇండియా మూవీను చేయనున్నాడు. ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో కూడారూపొందుతుంది. హిందీలోకి డబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం గురించిన మరింత సమాచారం త్వరలోనే వచ్చే అవకాశముంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All