
నిన్న అట్టహాసంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ చిత్రం లాంచ్ అయిన విషయం తెల్సిందే. అగ్ర దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ ఎత్తున ఈ ప్యాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రం పూజ కార్యక్రమానికి మాత్రం దిల్ రాజు చాలానే ఖర్చు చేసాడట.
పూజ కార్యక్రమం కంటే ముందు ఈ సినిమా కీ కాస్ట్ అండ్ క్రూ తో కలిసి ఫోటోషూట్ చేసాడు శంకర్. అందరిచే డిజైనర్ సూట్స్ ధరింపజేసి చేసిన ఈ ఫోటోషూట్ కు భారీగా ఖర్చు అయిందిట.
ఇక నిన్నటి లాంచ్ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది. సినిమాలో పనిచేసే వారితో పాటు అతిధులు కూడా బాగానే వచ్చారు. వాళ్ళ ఫ్లయిట్ ఖర్చులు, హోటల్ చార్జీలు, ఇతరత్రా ఖర్చులు ఇలా అన్నీ కలుపుకుని దిల్ రాజుకు కోటి రూపాయల పైనే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. శంకర్ అంటే మరి ఆ మాత్రం ఉండాల్సిందే కదా.
It was a stage full of stars! Here are a few images from the grand launch event of #RC15 and #SVC50. @shankarshanmugh @AlwaysRamCharan@advani_kiara @MusicThaman @DOP_Tirru @ramjowrites @saimadhav_burra @SVC_official #RC15Begins pic.twitter.com/UXooAuepsE
— Sri Venkateswara Creations (@SVC_official) September 8, 2021