Homeగాసిప్స్మహేష్ నో అంటే విజయ్ ఎస్ అన్నాడు

మహేష్ నో అంటే విజయ్ ఎస్ అన్నాడు

మహేష్ నో అంటే విజయ్ ఎస్ అన్నాడు
మహేష్ నో అంటే విజయ్ ఎస్ అన్నాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. రీసెంట్ గా సైమా అవార్డ్స్ లో కూడా ఈ చిత్రం పంట పండించింది. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లితో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు మహేష్.

అయితే వంశీ చెప్పిన కథకు మహేష్ కొన్ని కరెక్షన్స్ చెప్పాడట. మహేష్ చెప్పిన కరెక్షన్స్ ను సమయానికి పూర్తి చేయకపోవడంతో మహేష్ సర్కారు వారి పాట చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. అయితే మహేష్ నో అన్న కథను వంశీ పైడిపల్లి తమిళ స్టార్ హీరో విజయ్ కు చెప్పగా ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఇన్స్టంట్ గా ఎస్ చెప్పేశాడట.

- Advertisement -

ఇప్పుడు ఆ చిత్ర స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమవుతోంది. దసరాకు చిత్రాన్ని లాంచ్ చేసి వచ్చే జనవరిలో షూటింగ్ కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వంశీ. విజయ్ ఈలోగా బీస్ట్ చిత్రాన్ని పూర్తి చేస్తాడు. దిల్ రాజు భారీ వ్యయంతో వంశీ-విజయ్ చిత్రాన్ని నిర్మించడానికి సమాయత్తమవుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All