Homeగాసిప్స్థమన్ విషయంలో బన్నీ, త్రివిక్రమ్ గొడవపడ్డారా?

థమన్ విషయంలో బన్నీ, త్రివిక్రమ్ గొడవపడ్డారా?

థమన్ విషయంలో బన్నీ, త్రివిక్రమ్ గొడవపడ్డారా?
థమన్ విషయంలో బన్నీ, త్రివిక్రమ్ గొడవపడ్డారా?

త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరీర్ లో ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి పనిచేసారు. మొదట మణిశర్మతో సినిమాలు చేసిన త్రివిక్రమ్, తర్వాత దేవి శ్రీ ప్రసాద్ కు షిఫ్ట్ అయ్యాక, వీరిద్దరి కాంబినేషన్ లో సూపర్ హిట్స్ వచ్చాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ దేవి శ్రీ ప్రసాద్ తో త్రివిక్రమ్ కు చెడింది. ఇద్దరికీ వర్క్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, అంతే కానీ పర్సనల్ రిలేషన్ ఏం దెబ్బతినలేదని కూడా అన్నారు. దేవి శ్రీ ప్రసాద్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత మిక్కీ జె మేయర్ సంగీత దర్శకత్వంలో అ.. ఆ సినిమా చేసాడు. దాని తర్వాత అజ్ఞాతవాసి విషయానికి వస్తే అనిరుధ్ ను తీసుకువచ్చాడు. మళ్ళీ అనిరుధ్ తో ఏమైందో ఏమో, ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రానికి తన పేరు ప్రకటించి మళ్ళీ తీసేసారు. ఈసారి థమన్ ను తీసుకున్నారు. అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి థమన్ ప్రాణం పెట్టి పనిచేసాడనే చెప్పాలి. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్టేజ్ మీద చెప్పాడు కూడా.

ఇంత వరకూ బానే ఉంది. త్రివిక్రమ్ తర్వాతి సినిమా అల వైకుంఠపురములో చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంగీత దర్శకుడ్ని ఎంపిక చేయడానికి అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మధ్య పెద్ద డిస్కషన్ నడిచిందని ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. ఈ చిత్రానికి థమన్ అయితే సరిపోడని అల్లు అర్జున్ భావించాడట. అందుకే దేవి శ్రీ ప్రసాద్ తో వెళదాం.. కావాలంటే నేను మధ్యవర్తిగా ఉండి మాట్లాడతాను అని కూడా బన్నీ ప్రపోజ్ చేసాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం థమన్ తో పనిచేయడానికే మొగ్గు చూపాడట. ఈ సినిమాకు థమన్ సరిపోతాడు నాకు నమ్మకం ఉంది, నన్ను నమ్ము అని త్రివిక్రమ్ అన్నట్లు చెబుతున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చివరికి థమన్ ఈ చిత్రానికి చేయడానికి బన్నీ కూడా ఎస్ అన్నట్లు తెల్సింది.

- Advertisement -

కట్ చేస్తే ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంలో రెండు పాటలు విడుదలవ్వగా రెండూ కూడా చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సామజవరగమన అయితే ఈ కాలంలో వచ్చిన బెస్ట్ మెలోడీగా అందరి మన్ననలు పొందుతోంది. ఈ ట్యూన్ కు అందరూ ఫిదా అవుతున్నారు. అందుకే ఈ పాట అప్పుడే 60 మిలియన్ కు చేరువైంది. సినిమా విడుదల నాటికి 100 మిలియన్ చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక రెండో పాట రాములో రాముల బెస్ట్ మాస్ బీట్ గా నిలిచింది. తొలి 24 గంటల్లో ఈ పాటకు వచ్చినన్ని వ్యూస్ మరే సౌత్ ఇండియన్ సాంగ్ కు రాలేదు. ఇలా తొలి రెండు పాటలు ఇంత పెద్ద హిట్స్ అవుతాయని బన్నీ, త్రివిక్రమ్ కూడా ఊహించకపోవడంతో వాళ్లిప్పుడు థమన్ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ రెండు పాటల వల్ల సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. సో, ప్రమోషన్స్ విషయంలో తమ పని సగం పూర్తయినట్లే అని అనుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All