Homeటాప్ స్టోరీస్త్రివిక్రమ్ పుట్టినరోజుకి 'అల వైకుంఠపురములో' ఏం చేస్తారు?

త్రివిక్రమ్ పుట్టినరోజుకి ‘అల వైకుంఠపురములో’ ఏం చేస్తారు?

త్రివిక్రమ్ పుట్టినరోజుకి 'అల వైకుంఠపురములో' ఏం చేస్తారు?
త్రివిక్రమ్ పుట్టినరోజుకి ‘అల వైకుంఠపురములో’ ఏం చేస్తారు?

ప్రమోషన్స్ పరంగా చూసుకుంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో దూసుకుపోతోంది. సినిమాకి ఇంకా మూడు నెలల సమయమున్నా కానీ ఇప్పటికే సినిమాకి సంబంధించి చిన్న వీడియో బిట్, సమజవరగమనా సాంగ్, రాములో రాముల వీడియో సాంగ్ టీజర్ వదిలారు. దీపావళి సందర్భంగా మరో రెండో రోజుల్లో రాములో రాముల ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. సామజవరగమనా పాటకు ఎవరూ ఊహించని రిసెప్షన్ రావడంతో అల వైకుంఠపురములో టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఇప్పటికే ఈ పాట 50 మిలియన్ వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. సినిమా విడుదలయ్యే నాటికి 100 మిలియన్ వ్యూస్ రావడం పక్కా. లైక్స్ విషయంలో ఇప్పటికే ఈ పాట రికార్డులను తిరగరాసింది. ఏ తెలుగు పాటకు రాని విధంగా 750K+ లైక్స్ వచ్చాయి. సినిమా రిలీజ్ నాటికి 1 మిలియన్ లైక్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఇక రాములో రాముల పాట అదిరిపోనుందని టాక్ రావడంతో ఈ పాట కూడా వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సినిమా విడుదలకు మూడు నెలల ముందే ఇంత హైప్ రావడంతో అల వైకుంఠపురములో యూనిట్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. అయితే నవంబర్ 7న చిత్ర దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో ఆరోజు అల వైకుంఠపురములో టీజర్ రిలీజ్ చేద్దామా అన్న చర్చ యూనిట్ లో మొదలైందిట.

- Advertisement -

మూడు నెలల ముందే అన్నీ వదిలేస్తే అది సినిమాకి ప్లస్సా, మైనస్సా అని ఆలోచిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో టీజర్ రిలీజ్ పై ఒక డెసిషన్ తీసుకుంటారని తెలుస్తోంది. లేదంటే టీజర్ బదులు సింపుల్ గా మూవీ పోస్టర్ ఒకటి, కొన్ని వర్కింగ్ స్టిల్స్ విడుదల చేద్దామా అన్న ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారు ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు అల వైకుంఠపురములో.. కి పోటీగా దిగుతున్న మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ విషయంలో అస్సలు కంగారు పడట్లేదు. ఏది ఏమైనా కానీ డిసెంబర్ నుండే ప్రమోషన్స్ మొదలుపెడదామని వారు డిసైడ్ అయిపోయారు. అందుకే దీపావళికి కూడా మహేష్ బాబు లుక్ ఒకటి, విజయశాంతి లుక్ ఒకటి విడుదల చేసి సరిపెడుతున్నారు. డిసెంబర్ నుండి ఏకధాటిగా ప్రమోషన్స్ తో పిచ్చెక్కించి హైప్ తీసుకొద్దామని భావిస్తున్నారు. మరి ఈ రెండిట్లో ఎవరి స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుందో చూడాలి.

అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నవదీప్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. థమన్ సంగీత సారధ్యంలో ఈ చిత్ర ఆల్బమ్ రూపొందనుంది. చినబాబు, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టబు ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. సంక్రాంతికి అల వైకుంఠపురములో సందడి చేయనుంది. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. అదే రోజున సరిలేరు నీకెవ్వరు కూడా రిలీజ్ కు షెడ్యూల్ అయిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All