Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ ఎందుకింత తొందర పడుతున్నాడు?

అల్లు అర్జున్ ఎందుకింత తొందర పడుతున్నాడు?

అల్లు అర్జున్ ఎందుకింత తొందర పడుతున్నాడు?
అల్లు అర్జున్ ఎందుకింత తొందర పడుతున్నాడు?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పరంగా ప్రస్తుతం ఉన్న టాప్ 5 తో పోల్చుకుంటే కొంచెం వెనకపడ్డాడనే చెప్పాలి. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన దువ్వాడ జగన్నాథం ఎబోవ్ యావరేజ్ తోనే సరిపెట్టుకుంది. తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన నా పేరు సూర్య మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. సో ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్థితిలో నిలిచాడు అల్లు అర్జున్. అందుకే అల వైకుంఠపురములో చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమాను హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు.

అయితే ఈ ఆలోచనలతో మరీ ఎక్కువగా అల వైకుంఠపురములో గురించి ఆలోచిస్తున్నాడా అనిపిస్తోంది. సాధారణంగా ఏదైనా తెలుగు సినిమాను ప్రమోట్ నెల రోజులు ముందు నుండీ చేస్తారు. పాటలు కూడా నెల రోజులు ముందు నుండి ఒకటి ఒకటిగా విడుదలవుతుంది. రెండు నెలల ముందు ఒక టీజర్, 15 రోజులు ముందు ట్రైలర్… జనరల్ గా ఇలా ఉంటుంది ప్లాన్. కానీ అల వైకుంఠపురములో అన్నీ ముందే జరిగిపోతున్నాయి. సినిమాను జనాల్లో ఉంచాలన్న తాపత్రయం అల వైకుంఠపురములో టీమ్ కు మరీ ఎక్కువైపోయింది అనిపిస్తోంది.

- Advertisement -

ఎప్పుడో సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమాకు 5 నెలల ముందే ప్రివ్యూ టైప్ లో ఒక చిన్న వీడియో వదిలారు. గత నెలలో అంటే సినిమా విడుదలకు నాలుగు నెలల ముందే సినిమాలోని ఫస్ట్ సింగిల్ సామజవరగమనా విడుదలైంది. ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీని గురించి రెండు వారాల పాటు అల వైకుంఠపురములో టీమ్ ప్రచారం చేసుకున్నారు. ఈ సందడి ఇంకా పూర్తవ్వకముందే దీపావళి సందర్భంగా రెండో పాట ‘రాములో రాముల’ను ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. ఈరోజు ఈ పాటకు సంబంధించిన 26 సెకెన్ల నిడివున్న ప్రోమోను వదిలారు. అక్టోబర్ కే రెండు పాటలు విడుదల చేసారు. నవంబర్ లో టీజర్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

డిసెంబర్ నెలాఖరుకు ట్రైలర్ ను మధ్యమధ్యలో మిగతా పాటలను వదలాలని అల వైకుంఠపురములో టీమ్ స్కెచ్ వేసింది. సంక్రాంతికి మొత్తం నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో మహేష్ బాబు వంటి టాప్ హీరో నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఉంది. పైగా ఈ రెండు చిత్రాలూ ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. అందుకే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో తమ సినిమాకే ఎక్కువ హైప్ ఉండాలన్న ఉద్దేశంతో అల్లు అర్జున్ అండ్ కో అల వైకుంఠపురములో టీమ్ ప్రమోషన్స్ ను సినిమా విడుదలకు ఐదు నెలల ముందు నుండే ప్లాన్ చేసారు.

అయితే ఇది ప్రతీసారి వర్కౌట్ అవ్వదు. ముందునుండీ హైప్ పెంచేస్తే ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయి మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. మరి అల వైకుంఠపురములో విషయంలో టీమ్ అవలంభిస్తున్న స్ట్రాటజీ కరెక్టో కాదో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All