Homeగాసిప్స్ఢీ సీక్వెల్ టైటిల్ కన్ఫర్మ్ అయ్యిందా?

ఢీ సీక్వెల్ టైటిల్ కన్ఫర్మ్ అయ్యిందా?

ఢీ సీక్వెల్ టైటిల్ కన్ఫర్మ్ అయ్యిందా?
ఢీ సీక్వెల్ టైటిల్ కన్ఫర్మ్ అయ్యిందా?

మంచు విష్ణు కెరీర్ లో చాలా స్పెషల్ చిత్రంగా ఢీ నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. విష్ణు కెరీర్ లో బ్లాక్ బస్టర్ రేంజ్ హిట్ అంటే అది ఢీ మాత్రమే. అప్పట్లో సినిమా రిలీజ్ కే నానా తంటాలు పడి విడుదలైన ఈ చిత్రం విశేషంగా జనాల్ని ఆకర్షించింది. దర్శకుడు శ్రీను వైట్లకు కూడా ఈ సినిమాతోనే దర్శకుడిగా స్టార్ తిరిగింది. ఆపై స్టార్ హీరోలతో వరసగా పనిచేసాడు శ్రీను వైట్ల. ఆపై తన ఫార్ములాకు తానే బలయ్యాడు. ఆగడు నుండి వరసపెట్టి డిజాస్టర్లు అందుకుని ఇప్పుడు దర్శకుడిగా పూర్తిగా చార్మ్ ను కోల్పోయాడు. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా శ్రీను వైట్లతో సినిమా చేయాలంటే ఆలోచిస్తారు. మరోవైపు మంచు విష్ణు పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. వరసపెట్టి ప్లాపులతో తన మార్కెట్ ను పూర్తిగా తగ్గించేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో సినిమా గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఢీ సినిమా వార్షికోత్సవం సందర్భంగా కూడా మంచు విష్ణు ఢీ సీక్వెల్ గురించి మాట్లాడాడు. శ్రీను వైట్లతో సినిమా ఉంటుందని  తెలిపాడు. చూస్తుంటే ఇప్పుడు ఈ వార్తలు కార్యరూపం దాల్చుతున్నట్లు అర్ధమవుతోంది.

- Advertisement -

ఢీ సీక్వెల్ కు అన్నీ సెట్ అవుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఓ కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఇక ఈ సినిమాకు ఢీ అండ్ ఢీ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. అంటే డేరింగ్ అండ్ డాషింగ్ అన్నది మీనింగ్ అట. మరి ఈ సీక్వెల్ తో ఇద్దరూ ఒకరికొకరు హిట్ ను అందించుకుని ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All