Homeటాప్ స్టోరీస్హీరో ధనుష్ కు గాయాలు

హీరో ధనుష్ కు గాయాలు

dhanush injured in shooting సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు , తమిళ స్టార్ హీరో ధనుష్ షూటింగ్ లో గాయాలపాలయ్యాడు . ధనుష్ కు గాయాలు కావడంతో ఒక్కసారిగా యూనిట్ వర్గాలు షాక్ కి గురయ్యాయి అయితే కుడి కాలుకి , ఎడమ చేతికి గాయాలు అయినప్పటికీ ఆ గాయాలను లెక్కచేయకుండా కొద్దిసేపు మాత్రమే విశ్రాంతి తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేయించి మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నాడు ధనుష్ .

తాజాగా ఈ హీరో మారి సీక్వెల్ లో నటిస్తున్నాడు . 2015 లో వచ్చిన ”మారి ” సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . ఆ సినిమాకు సీక్వెల్ గా మళ్ళీ ఇన్నాళ్లకు రూపొందుతోంది మారి 2 . బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి ధనుష్ సరసన నటిస్తోంది . ఇక కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తోంది . కాగా ఈ చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు దర్శకులు బాలాజీ మోహన్ . అయితే యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ధనుష్ కు గాయాలు కావడంతో షూటింగ్ ఆపేద్దామని చెప్పినప్పటికీ ధనుష్ మాత్రం వినలేదట ! ఎందుకంటే షూటింగ్ ఆపేస్తే చాలా నష్టం కాబట్టి పూర్తిచేసి చికిత్స కోసం వెళ్ళాడట . అయితే భారీ గాయాలు కాలేదు కాబట్టి చిత్ర బృందం కూడా ఊపిరి పీల్చుకుంది .

- Advertisement -

English Titledhanush injured in shooting 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All