Homeటాప్ స్టోరీస్కాలా డిజాస్టర్ కానీ.. హిట్ అని రజనీ కి చెప్పారట

కాలా డిజాస్టర్ కానీ.. హిట్ అని రజనీ కి చెప్పారట

wrong feed back to rajinikanth on kaala సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం డిజాస్టర్ అయ్యింది . జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన కాలా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది . భారీ రేట్ల కు కాలా చిత్రాన్ని కొనుకున్న బయ్యర్లు ఘోరంగా నష్టపోతున్నారు . ఒక్క తమిళనాట మాత్రమే కాలా మంచి వసూళ్లు సాధిస్తోంది మిగతా అన్నిచోట్లా ఘోర పరాజయం పాలయ్యింది . అయితే ఇంత దారుణంగా కాలా పరిస్థితి ఉండగా రజనీకాంత్ కు మాత్రం కాలా మంచి హిట్ అయ్యిందని , మంచి వసూళ్లు సాధిస్తోందని చెప్పారట !

సూపర్ స్టార్ రజనీకాంత్ కు కాలా ప్లాప్ అయిన సంగతి తెలియకుండా జాగ్రత్తపడుతున్నారట ధనుష్ అండ్ కో అంతేకాదు హీరో గారి స్టాఫ్ కూడా . అన్ని చోట్లా మంచి వసూళ్లు వస్తున్నాయని చెప్పడంతో నిజంగానే కాలా హిట్ అని అనుకుంటున్నాడు రజనీకాంత్ . అయితే ఇలా ఎన్నిరోజులు మేనేజ్ చేస్తారు ? మరో వారం రోజుల్లోనో , నెల రోజుల్లోనో అసలు నిజం తెలిసిపోతుంది కాలా డిజాస్టర్ అన్న విషయం . అసలు విషయం తెలియని రజనీకాంత్ మాత్రం కాలా హిట్ అయ్యిందని అంటున్నాడు పాపం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All