Homeటాప్ స్టోరీస్చనిపోయిన రజనీకాంత్ అభిమాని

చనిపోయిన రజనీకాంత్ అభిమాని

rajinikanth fan dies after standing for kaala ticketతన అభిమాన హీరో చిత్రాన్ని చూడాలనే కసితో టికెట్ల కోసం క్యూలో నిలబడి , నిలబడి …….. టికెట్టు దొరక్క మళ్ళీ మళ్ళీ క్యూలో నిలబడి నిస్సత్తువతో చచ్చిపోయాడు రజనీకాంత్ వీరాభిమాని . సంచలనం సృష్టించిన ఈ సంఘటన తమిళనాడు లో జరిగింది . తమిళనాడు కి చెందిన కుమరేషన్ రజనీకాంత్ కు వీరాభిమాని , రజనీ సినిమా వస్తుందంటే చాలు ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఆ సినిమా చూడాల్సిందే . అయితే రజనీకాంత్ కు తమిళనాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఇటీవల విడుదలైన ” కాలా ” చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చినప్పటికీ క్రౌడ్ మాత్రం విపరీతంగా ఉంది తమిళనాట .

టికెట్ కోసం క్యూలో నిలబడిన కుమరేషన్ కు పలు షోలకు కూడా టికెట్ లభించలేదు అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడి లా క్యూ లోనే ఉండిపోయాడు నిద్రాహారాలు మాని . రెండురోజుల పాటు అదేపనిగా ఉన్నప్పటికీ పాపం అతడికి టికెట్ లభించలేదు ఆ నీరసం ఒకవైపు కాగా తిండి నిద్ర లేకపోవడంతో అర్దాంతరంగా తనువూ చాలించాడు కుమరేషన్ . నిరాశతో ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు కుమరేషన్ దాంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే కుమరేషన్ చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో విషాదంలో మునిగింది అతడి కుటుంబం . రజనీ వీరాభిమాని చనిపోవడంతో అభిమానుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All