Homeటాప్ స్టోరీస్ప్రభాస్ తో సినిమా: దీపికా డేట్స్ అన్నీ వేస్ట్ అయినట్లేనా?

ప్రభాస్ తో సినిమా: దీపికా డేట్స్ అన్నీ వేస్ట్ అయినట్లేనా?

ప్రభాస్ తో సినిమా: దీపికా డేట్స్ అన్నీ వేస్ట్ అయినట్లేనా?
ప్రభాస్ తో సినిమా: దీపికా డేట్స్ అన్నీ వేస్ట్ అయినట్లేనా?

టాప్ ఇండియన్ నటి అన్న ప్రస్తావన రాగానే కచ్చితంగా దీపికా పదుకోన్ పేరు కూడా ఉంటుంది. నటిగా ఆమె స్థాయి అది. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ను సొంతం చేసుకుంది దీపికా. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించడమే కాదు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా తానేంటో నిరూపించుకుంది.

దీపికా పదుకోన్ ఈ ఏడాది టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో దీపికాను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా.

- Advertisement -

ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ నుండి దీపికా పదుకోన్ డేట్స్ ను తీసుకున్నాడు నాగ్ అశ్విన్. అయితే కోవిడ్ కారణంగా సినిమాలు అన్నీ ఆలస్యమవుతుండడంతో ఈ చిత్రం వెనక్కి జరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఏకంగా వచ్చే ఏడాదికి కానీ ఈ చిత్రం ప్రారంభమవ్వదు. సో, దీపికా ఇచ్చిన డేట్స్ అన్నీ వెస్ట్ అయినట్లే. మళ్ళీ వచ్చే ఏడాది కొత్తగా డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All