HomeUncategorizedప్రభాస్21: దీపికా టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్

ప్రభాస్21: దీపికా టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్

ప్రభాస్21: దీపికా టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్
ప్రభాస్21: దీపికా టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్

ఎప్పటినుండో వింటున్న వార్తే. ఈరోజు అధికారికంగా వెల్లడైంది. నిన్న సాయంత్రం ప్రభాస్21 టీమ్ ఒక ట్వీట్ చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ చిత్రం నుండి ఒక అప్డేట్ వస్తుందని తెలిపింది. అప్పటినుండి అది ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు. ఈరోజు చెప్పిన సమయానికే ఆ అప్డేట్ ను విడుదల చేసారు.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది అని అధికారికంగా తెలిపారు. ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టాలీవుడ్ టాప్ హీరోతో కలిసి సినిమా చేస్తుండడంతో ఇదే పెర్ఫెక్ట్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అని ప్రభాస్ అభిమానులు ఆనందిస్తున్నారు.

- Advertisement -

బాహుబలి చిత్రంతో నార్త్ లో ప్రభాస్ రేంజ్ బాగా పెరిగింది. అక్కడ ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరనే చెప్పొచ్చు. సాహో చిత్రంతో అది మరింత పెరిగింది. సాహో సౌత్ లో ఫెయిల్ అయినా కానీ నార్త్ లో బాగా ఆడింది. 150 కోట్లకు పైనే గ్రాస్ ను వసూలు చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ తర్వాతి సినిమాలపై మరింత ఫోకస్ పెరిగింది. ప్రభాస్21 చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయనున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివర్లో చిత్రాన్ని పట్టాలెక్కిద్దామనుకున్నారు కానీ ప్రస్తుతం పరిస్థితుల వల్ల అది వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయింది. ఏదైతేనేం మొత్తానికి ప్రభాస్ తో దీపికా పదుకోన్ నటిస్తోంది అన్న వార్త ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All