
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన దే దే ప్యార్ దే అనే బాలీవుడ్ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది . అజయ్ దేవ్ గన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో టబు అజయ్ దేవ్ గన్ భార్యగా నటించగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రేయసిగా నటించింది . అంతేకాదు గ్లామర్ విషయంలో టబు కంటే రెండాకులు ఎక్కువే చదివింది రకుల్ ప్రీత్ సింగ్ అందుకే రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా రొమాంటిక్ సీన్స్ లో కూడా ముదురు హీరోతో రెచ్చిపోయింది .
గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రంతో రకుల్ ప్రీత్ సింగ్ కు చాలామంచి పేరు వచ్చింది . దాంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది . నేను నటించిన దే దే ప్యార్ దే 101 కోట్లని సాధించింది అంటూ . హిందీలో తాను నటించిన చిత్రం పెద్ద హిట్ కావడంతో రకుల్ ఆనందానికి అంతేలేకుండా పోయింది . తెలుగులో ఈ భామ తాజాగా మన్మథుడు 2 చిత్రంలో నటిస్తోంది నాగార్జున సరసన .