Homeటాప్ స్టోరీస్హీరో అజయ్ దేవ్ గన్ తండ్రి మృతి

హీరో అజయ్ దేవ్ గన్ తండ్రి మృతి

బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ ఇంట విషాదం నెలకొంది . అజయ్ దేవ్ గన్ తండ్రి వీరు దేవ్ గన్ అనారోగ్యంతో ఈరోజు ఉదయం కన్నుమూశాడు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరు దేవ్ గన్ ముంబై లోని సూర్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు . దాంతో అజయ్ దేవ్ గన్ కుటుంబం విషాదంలో మునిగింది . వీరు దేవగన్ బాలీవుడ్ లో 80 చిత్రాలకు పైగా స్టెంట్ మాస్టర్ గా పనిచేసాడు .

- Advertisement -

అలాగే నటుడిగా నటించడమే కాకుండా పలు చిత్రాలను నిర్మించాడు దర్శకత్వం కూడా వహించాడు . వీరు దేవగన్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరుగనున్నాయి . బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన అజయ్ దేవగన్ తెలుగులో ఎన్టీఆర్ , రాంచరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే . అజయ్ దేవగన్ తండ్రి చనిపోయాడని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All