Homeటాప్ స్టోరీస్రానా త‌మ్ముడు ముంబైలో ఏం చేస్తున్నాడు?

రానా త‌మ్ముడు ముంబైలో ఏం చేస్తున్నాడు?

రానా త‌మ్ముడు ముంబైలో ఏం చేస్తున్నాడు?
రానా త‌మ్ముడు ముంబైలో ఏం చేస్తున్నాడు?

`బాహుబ‌లి` అనూహ్య విజ‌యం త‌రువాత రానా కెరీర్ మారిపోయింది. త‌ను ఏ సినిమా చేసినా భారీ స్థాయిలో వుండేలా చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం మూడు భాష‌ల్లో `హాథీ మేరే సాథీ` చిత్రాన్ని చేస్తున్న రానా తెలుగులో వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో `విరాట‌ప‌ర్వం` చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాల‌తో పాటు గుణ‌శేఖ‌ర్ తెర‌పైకి తీసుకురాబోతున్న `హిర‌ణ్య‌క‌శిప‌` కోసం సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇదిలా వుంటే రానా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అయిపోతున్నాడంటూ గ‌త కొంత కాలంగా వ‌రుస క‌థ‌నాలు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. రానా త‌మ్ముడు అభిరామ్‌ని త్వ‌ర‌లోనే హీరోగా ప‌రిచ‌యం చేయ‌డానికి సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం అత‌నికి ముంబైలో ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇప్పిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

బాలీ షేప్‌తో పాటు, లుక్ విష‌యంలోనూ ట్రైన్ అవుతున్నాడ‌ట‌. ఇటీవ‌లే ఓ యువ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో రానా త‌మ్ముడు అభిరామ్‌ని ప్ర‌త్యేక‌ ట్రైన‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో హీరో లుక్ కోసం సిద్ధం చేయిస్తున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. అభిరామ్ ట్రైనింగ్ పూర్త‌యిన వెంట‌నే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని ప్రీ ప్రొడ‌క్ష‌న్‌కి సంబంధించిన వ‌ర్క్ మొద‌లుపెట్టిన‌ట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లోనే చేయ‌బోతున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All