Homeటాప్ స్టోరీస్రిలీజ్‌కు  ముందే బాహుబ‌లి 2 రికార్డ్ బ్రేక్‌!

రిలీజ్‌కు  ముందే బాహుబ‌లి 2 రికార్డ్ బ్రేక్‌!

Rajamouli  RRR  Pre release Business report
Rajamouli  RRR  Pre release Business report

ప్ర‌భాస్‌, రానా న‌టించిన `బాహుబ‌లి` సిరీస్ చిత్రాలు దేశ వ్యాప్తంగా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించాయే అంద‌రికి తెలిసిందే. ముఖ్యంగా పార్ట్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించ‌డ‌మేకాకుండా ప్రీరిలీజ్ బిజినెస్ ప‌రంగానూ ద‌క్షిణాది చిత్రాల్లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 2000 కోట్ల మైలు రాయిని చేరుకుని స‌రికొత్త రికార్డుని నెల‌కొల్పింది. ద‌క్షిణాదిలో ముఖ్యంగా అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించ‌డంతో ఈ సినిమా పేరుతో ఓ రికార్డుగా  ట్రేడ్ వ‌ర్గాలు మెయింటైన్ చేయ‌డం మొద‌లైంది. బాహుబ‌లి, నాన్ బాహుబ‌లి రికార్డ్స్ అనే నూత‌న సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టారు.

`బాహుబ‌లి` త‌రువాత తెలుగులో రిలీజ్ అయిన ఏ సినిమా ఆ రికార్డుల్ని స‌మం చేయ‌లేక‌పోయింది. తాజాగా రాజ‌మౌళి రూపొందిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌` ప్రీరిలీజ్ బిజినెస్ `బాహుబ‌లి 2` రికార్డుల్ని సౌత్‌లో అధిగ‌మించడం ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది. ఓ త‌మిళ  ట్రేడ్ అన‌లిస్ట్ తాజాగా జ‌రిగిన `ఆర్ ఆర్ ఆర్‌` బిజినెస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓవ‌ర్సీస్ మిన‌హా ద‌క్షిణాదిలో 400 కోట్ల‌కు మించి ప్రిరిలీజ్ బిజినెస్ జ‌రిగిన చిత్రంగా `ఆర్ ఆర్ ఆర్‌` చరిత్ర సృష్టిస్తోందన వెల్ల‌డించారు. నైజాం – 75 కోట్లు, ఆంధ్రా- 100 కోట్లు, సీడెడ్ – 40 కోట్లు, క‌ర్ణాట‌క – 50 కోట్లు, కేర‌ళ 15 కోట్లు, త‌మిళ వెర్ష‌న్‌కు సంబంధించి ఇంకా టాక్స్ జ‌రుగుతున్నాయ‌ని. ఓవ‌ర్సీస్ రైట్స్ 70 వ‌ర‌కు ప‌లికే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

- Advertisement -

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్‌, ఆంధ్రా క‌లిపి 215 కోట్ల‌కు అమ్ముడు పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. త‌మిళ రైట్స్ మిన‌హా యించి 350 దాటిన ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ 400 కోట్లు ఎట్టిప‌రిస్థితుల్లోనూ దాటుతుంద‌ని, బాహుబ‌లి 2 రికార్డుని బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ పండితులు చెప్ప‌డం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All