
కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తరిమేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుట్టమైన ఏర్పాట్లు చేశాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి ప్రజల్ని కాపాడటం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంత వరకు చేయాలో.. ఏం చేయాలో అది చేస్తున్నాయి. ప్రభుత్వంతో పాటు ఈ సమరంలో మేము సైతం అంటూ సినీ పరిశ్రమ పెద్దలు, హీరోలు తమ వంతు బాధ్యతగా భారీ స్థాయిలో విరాళాలు అందిస్తూ అండగా నిలుస్తున్నారు.
కరోనా కారణంగా పని లేకుండా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల కోసం చిరంజీవి చైర్మన్‌గా సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇప్పటికే కోట్లల్లో విరాళాలు వచ్చి పడ్డాయి. తాజాగా బిగ్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య సీసీసీ చారిటీకి 10 లక్షలు విరాళం ప్రకటించారు. డీవవీ దానయ్య ప్రస్తుతం భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `మా పరిశ్రమ మా విజన్‌ను నిజం చేయడానికి ప్రతీరోజు ఎంతో మంది వ్యక్తుల శ్రమపై ఆధారపడి ఉంటుంది. కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా వారికి మద్దతుగా నిలవడానికి నా వంతుగా 10 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను` అని వెల్లడించారు.
Our industry depends on several individuals who work hard every day to make our visions a reality. We’d like to do our bit to support them via the great initiative #CoronaCrisisCharity by contributing an amount of Rs 10 lakhs for the cause.#DVVDanayya @ssrajamouli @KChiruTweets
— DVV Entertainment (@DVVMovies) April 10, 2020
Credit: Twitter