Homeటాప్ స్టోరీస్కరోనా బాధితులకు పెట్టే భోజనం ఇదే..!

కరోనా బాధితులకు పెట్టే భోజనం ఇదే..!

Coronavirus patient diet
Coronavirus patient diet

కరోనా వైరస్ గురించి అవగాహన కన్నా.. అపోహలు ఎక్కువగా వెళ్తున్నాయి. ఇప్పటివరకూ అన్ని రకాల మీడియా వాళ్ళు కరోనా వైరస్ మీద ఎన్నో రకాల ఊహాగానాలు, ప్రచారాలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే కరోనా వైరస్ మీద వస్తున్న ప్రచారాలకు, పుకార్లకు అంతు లేదు. ఇంతా చేసి కరోనా వచ్చిన వాళ్ళను, కరోనాతో బాధపడే వాళ్ళను మినహాయిస్తే కరోనా వైరస్ వచ్చిన పేషంట్ కి సేవలు చేసే సిబ్బందిని ఎవరూ ఇంటర్వ్యూ చెయ్యడం లేదు. ఇక అనేక రకాల వార్తలతో విసిగిపోతున్న ప్రజలు నేరుగా మెయిన్ స్ట్రీం మీడియా వాళ్ళకు నేరుగా కరోనా వైరస్ వచ్చి తగ్గి కోలుకున్న వాళ్ళ స్పందన, ఇంటర్వ్యూ చెయ్యమని సవాల్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అసలు కరోనా వైరస్ వచ్చిన రోగులకు ఎలాంటి చికిత్స అందిస్తారు.? అనే ప్రశ్న అందరి మనసుల్లో ఉంది.

అసలు కరోనా వైరస్ వచ్చిన వాళ్ళలో తెలంగాణకు సంబంధించి ఒక వ్యక్తి కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు. కరోనా వైరస్ వచ్చిన పేషంట్ లలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళు కోలుకునే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా వైరస్ వచ్చి, ఐసోలేషన్ వార్డులో ఉండే పేషంట్ లకు ఎలాంటి ఆహారం అందిస్తారు.? అన్న విషయం పై కూడా ప్రజలలో ఎంతో ఆసక్తి, కుతూహలం ఉంది. ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

- Advertisement -

ఇక కరోనా వైరస్ తో బాధపడే పేషంట్ లకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద… దోస, సాంబార్, రెండు ఆరెంజ్ లు (ఇమ్యునిటీ పెరగడానికి), 2 గుడ్లు, టీ, మినరల్ వాటర్ తోపాటు పేషంట్ కోరిక మీద న్యూస్ పేపర్ మరియు టిష్యూ పేపర్స్ కూడా ఇచ్చినట్లు ఆ ఫోటోలో తెలుస్తుంది. ఇక మధ్యాహ్న భోజనం, సాయంత్ర్రం మళ్ళీ స్నాక్స్, రాత్రి భోజనం కూడా మంచిగా అన్నిరకాల పోషకవిలువలతో అందిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All