Homeటాప్ స్టోరీస్వివాదంలో విజయ్ దేవరకొండ నోటా చిత్రం

వివాదంలో విజయ్ దేవరకొండ నోటా చిత్రం

Controversy on vijay devarakonda NOTAవిజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం వివాదంలో ఇరుక్కుంది . వచ్చేనెలలో నోటా విడుదలకు సిద్ధం అవుతుండగా ఎలాంటి అవాంతరాలు లేవు అనుకుంటున్న సమయంలో శశాంక్ వెన్నెలకంటి రూపంలో వివాదం వచ్చింది . నోటా చిత్రానికి శశాంక్ వెన్నెలకంటి రచయిత అయితే ఒప్పందం ప్రకారం తెలుగు హక్కుల్లో వాటా కోరాడట ! అయితే అసలు శశాంక్ వెన్నెలకంటి కి సంబంధం లేకుండా అతడ్ని తొలగించడంతో షాక్ తిన్న రచయిత వెంటనే చెన్నై పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడు . నిర్మాత జ్ఞానవేల్ రాజా పై కేసు పెట్టడంతో ఇక ఏదో ఒక విధంగా రాజీపడేంత వరకు విజయ్ దేవరకొండ నోటా చిత్రానికి ఇబ్బందులు తప్పవు .

రాజకీయ నేపథ్యంలో రూపొందిన నోటా చిత్రం టీజర్ కు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది , దానికి తోడు విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సంచలన విజయం సాధించడంతో ఒక్కసారిగా నోటా చిత్రం హాట్ కేక్ అయిపొయింది . 20 కోట్ల బడ్జెట్ కూడా పెట్టని ఈ చిత్రానికి ఒక్క తెలుగులోనే 30 కోట్లకు పైగా బిజినెస్ అయ్యేలా ఉంది ఇక తమిళనాట బిజినెస్ ఉంది అలాగే శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ రూపంలో అంతా కలిసి 60 నుండి 80 కోట్ల వరకు అయ్యేలా ఉంది . దాంతో ఈ వివాదం మొదలయ్యింది . మరి నోటా చిత్రం సకాలంలో విడుదల అవుతుందా ? లేదా ? చూడాలి .

- Advertisement -

English Title: Controversy on vijay devarakonda NOTA

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All