Homeటాప్ స్టోరీస్ట్రైలర్ తో నోటా పై భారీ అంచనాలు

ట్రైలర్ తో నోటా పై భారీ అంచనాలు

Huge expectations on vijay devarakondas NOTAవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన నోటా ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదల అయిన విషయం తెలిసిందే . నోటా చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు విజయ్ దేవరకొండ . ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ట్రైలర్ తో నోటా పై అంచనాలు పెరిగాయి అసలే గీత గోవిందం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో తదుపరి చిత్రం కావడంతో నోటా పై అంచనాలు పెరిగాయి .

ఇప్పటివరకు రకరకాల పాత్రల్లో విజయ్ దేవరకొండ ని చూసారు కానీ తొలిసారిగా రాజకీయ నాయకుడిగా , ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు . దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . అక్టోబర్ 4న నోటా చిత్రాన్ని భారీ ఎత్తున తెలుగు , తమిళ బాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ రాజకీయ చిత్రంతో విజయ్ దేవరకొండ భారీ హిట్ కొడితే ఆ తర్వాత భారీ చిత్రాల హీరో అవ్వడం ఖాయం . ఇప్పటికే గీత గోవిందం చిత్రంతో స్టార్ లీగ్ లో చేరిపోయాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -

English Title: Huge expectations on vijay devarakondas NOTA

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All