Homeటాప్ స్టోరీస్వివాదంలో దిల్ రాజు కొన్న సినిమా

వివాదంలో దిల్ రాజు కొన్న సినిమా

controversy on 96 tamil movieవిజయం కోసం అర్రులు చాస్తున్న అగ్ర నిర్మాత దిల్ రాజు తాజాగా తమిళంలో విడుదలైన 96 అనే చిత్ర రీమేక్ హక్కులను కొన్నాడు , అయితే ఆ సినిమా వివాదంలో ఇరుక్కుంది . అక్టోబర్ 4న విడుదలైన 96 చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది దాంతో ఆ చిత్ర బృందం తో పాటుగా దిల్ రాజు కూడా చాలా సంతోషపడ్డాడు కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకుండా 96 చిత్ర కథ నాదే అంటూ ఆర్ . విచు అనే వ్యక్తి వివాదానికి ఆజ్యం పోశాడు . నాలుగేళ్ళ క్రితం ఈ కథ ని నిర్మాత నందగోపాల్ కు చెప్పానని , కట్ చేస్తే ఇప్పుడు మరొక దర్శకుడితో నా సినిమాని రూపొందించారని …… నన్ను మోసం చేసారని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు రచయిత విచు .

విజయ్ సేతుపతి – త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది దాంతో చెన్నై వెళ్లి రీమేక్ హక్కులు కొన్నాడు దిల్ రాజు . నాని – సమంత జంటగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నాడు . అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో 96 కథ నాది అంటూ ఓ వ్యక్తి రావడం వివాదం అయ్యింది . అయితే విచు అనే వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు , వివాదాన్ని పెద్దది చేస్తున్నాడు కానీ 96 బృందం మాత్రం ఇతడి గురించి పట్టించుకోవడం లేదు ఎందుకో !ఈ వివాదం సద్దుమణిగితే తెలుగులో 96 చిత్రాన్ని రీమేక్ చేసే పనిలో పడతాడు దిల్ రాజు . పాపం ఈమధ్య వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు మరి .

- Advertisement -

English Title: controversy on 96 tamil movie

96 tamil movie

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All