Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్పెళ్లిచూపులు పై తీవ్ర స్థాయిలో విమర్శలు

పెళ్లిచూపులు పై తీవ్ర స్థాయిలో విమర్శలు

Controversy on pradeep's pellichupuluస్టార్ మా టివిలో ప్రదీప్ పెళ్లిచూపులు కార్యక్రమం అంటూ ఓ చెత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రోగ్రాం ప్రారంభం కాకముందే ప్రోమోల వల్ల ఎలా ఉండబోతోందో తెలియడంతో అప్పుడే విమర్శలు వచ్చాయి. అయితే ప్రోగ్రాం స్టార్ట్ అయ్యాక తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలను మంటగలిపే కార్యక్రమంగా భావించి నిప్పులు చెరుగుతున్నారు . ఒక అబ్బాయి కోసం 14 మంది అమ్మాయిలు వెంటపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించి మహిళల పట్ల చిన్న చూపు చూస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు మహిళలు.

- Advertisement -

బుల్లితెర అంటే మహిళలకు ఎంతో ప్రీతికరమైనది ఎందుకంటే సీరియల్స్ తో , స్పెషల్ ప్రోగ్రాం లతో పలు సినిమాలతో సేద తీరుతుంటారు. అలాంటి బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ కి పెళ్లిచూపులు అంటూ ఇంట్లో వాళ్ళు అందరూ చూడలేని విధంగా చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పైగా దీనివల్ల చెడు ఫలితాలు వస్తాయని అంటున్నారు. 14 మంది అమ్మాయిల్లో కొంతమంది నిజంగానే ప్రదీప్ ని ప్రేమిస్తే , ఆ ప్రేమ విఫలం అయితే ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి? దీని గురించి మా యాజమాన్యం ఎందుకు ఆలోచించలేదో కానీ ఇలాంటి కార్యక్రమం క్రొత్తదని అనుకుంటున్నారు కానీ హిందీలో ఇలాంటివి ఎప్పుడో వచ్చాయి. మద్యం తాగి ,కారు డ్రైవ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి యాంకర్ ప్రదీప్ అయితే అతడి పెళ్లిచూపులు అంటూ ఇంతోటి కార్యక్రమం చేయడం సమంజసమా ? ….. మా ?

English Title: Controversy on pradeep’s pellichupulu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts