Homeటాప్ స్టోరీస్కన్ఫర్మ్ : ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్

కన్ఫర్మ్ : ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్

 Confirm : NTR in NTR biopicఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించడం ఖాయమైపోయింది కాకపోతే అఫీషియల్ గా త్వరలోనే ప్రకటన జారీ చేయనున్నారు ఆ చిత్ర బృందం . ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే విపరీతమిన క్రేజ్ ని సొంతం చేసుకుంది . జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రేజ్ ఏర్పడింది , ఇక ఈ ఊపుకి జూనియర్ ఎన్టీఆర్ కూడా తోడైతే చెప్పాల్సిన పనేముంది పీక్స్ కి చేరుకోవడం ఖాయం . నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని ప్రతిస్టాత్మకంగా తీసుకున్నాడు . క్రిష్ ని దర్శకుడిగా ఎప్పుడైతే ఎంచుకున్నాడో అప్పుడే ఎన్టీఆర్ బయోపిక్ కి ఏనలేని క్రేజ్ రావడం మొదలయ్యింది . ఇక వరుసగా అందులో పాత్రధారులను పరిచయం చేసిన తీరు కూడా హైప్ క్రియేట్ కావడానికి కారణమయ్యింది .

కట్ చేస్తే ఎంతమంది ఉన్నప్పటికీ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ అంటే ఆ మజా నే వేరు అందుకే బాలయ్య ఎన్టీఆర్ ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట . హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబం ఒక్కటయ్యింది దాంతో బాబాయ్ – అబ్బాయ్ ల మద్య మళ్ళీ ప్రేమ , ఆప్యాయతలు చిగురించాయి కాబట్టి ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు . జనవరి 9 , జనవరి 24 న రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ ని కథానాయకుడు , మహానాయకుడు గా విడుదల చేయనున్నారు . అంటే జనవరిలో రికార్డుల మోత మోగడం ఖాయం ఎన్టీఆర్ అండతో .

- Advertisement -

English Title: Confirm : NTR in NTR biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All