Homeటాప్ స్టోరీస్త్వరలో పెళ్లి చేసుకోనున్న కమెడియన్ నటి

త్వరలో పెళ్లి చేసుకోనున్న కమెడియన్ నటి

త్వరలో పెళ్లి చేసుకోనున్న కమెడియన్ నటి
త్వరలో పెళ్లి చేసుకోనున్న కమెడియన్ నటి

తమిళ నటి విద్యుల్లేఖ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. గత కొన్ని రోజులుగా విద్యుల్లేఖకు పెళ్ళైపోయిందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి కూడా. అయితే ఈ విషయంపై ఇన్ని రోజులు మౌనం పాటించిన ఈమె ఈరోజు ఈ వార్తపై స్పందించింది. తనకు నిశ్చితార్ధం జరిగినట్లు ప్రకటించింది.

అవ్వడానికి తమిళ నటే అయినా కూడా విద్యుల్లేఖ తెలుగులో కూడా బాగానే సినిమాలు చేసింది. ఇక్కడ ఆమెకు పాపులారిటీ బాగుంది. రామయ్య వస్తావయ్యా, సరైనోడు, రాజు గారి గది వంటి సినిమాలతో ఆమె కామెడీ పంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొదటినుండీ కొంత బొద్దుగా ఉండే విద్యుల్లేఖ గత సంవత్సర కాలం నుండి జిమ్ కే పరిమితమై ఒళ్లును హూనం చేసుకుని స్లిమ్ గా తయారైంది. ఇప్పుడు విద్యుల్లేఖ నాజూకుగా తయారై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

- Advertisement -

జిమ్ లో తన ట్రైనర్ సంజయ్ తోనే ఆమె ప్రేమలో పడింది. ఈ మేరకు నిశ్చితార్ధం కూడా జరిగిందన్నమాట. విడుదలైన ఫోటోలు పెళ్లివి కాదు, ఎంగేజ్మెంట్ వి. పెళ్లి నవంబర్ లో ఉండనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All