Homeటాప్ స్టోరీస్రాజు గారి గది 3 5 డేస్ కలెక్షన్స్

రాజు గారి గది 3 5 డేస్ కలెక్షన్స్

రాజు గారి గది 3 5 డేస్ కలెక్షన్స్
రాజు గారి గది 3 5 డేస్ కలెక్షన్స్

రాజు గారి గది సిరీస్ లో మూడో సినిమా రాజు గారి గది 3కి మొదట మిశ్రమ స్పందన లభించింది. రివ్యూలు కూడా కొంచెం అటూ ఇటుగా వచ్చాయి. రెండో సినిమా ఆశించినంత మేర ఆడకపోవడంతో మూడో పార్ట్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఒత్తిడిలో ఓంకార్ ఉన్నాడు. అయితే రివ్యూలు తేడాగా వచ్చినా కానీ రాజు గారి గది 3 ఇంప్రెసివ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

అశ్విన్, అవికా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ తో లాభాల్లోకి అడుగుపెట్టింది. తొలి మూడు రోజుల్లోనే 3 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా అదే ఊపు కనబర్చింది. మొత్తంగా 5 రోజులకు రాజు గారి గది 3 4.79 కోట్ల షేర్ వసూలు చేసి లాభాల్లోకి వచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించిన చిత్రం కావడంతో అందరికీ లాభాలు అందాయి. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రం రొటీన్ గా ఉందని టాక్ వచ్చినా మాస్ కు నచ్చేలా తెరకెక్కడంతో బి, సి సెంటర్లలో కలెక్షన్స్ బాగున్నాయి. దీపావళి పండగ వస్తుండడంతో వసూళ్లు మరింత పుంజుకునే అవకాశముంది.

- Advertisement -

రాజు గారి గది మొదటి పార్ట్ మంచి విజయంసాధించగా, రెండో పార్ట్ లో నాగార్జున, సమంత నటించారు. అయినా కూడా రెండో భాగం నిరాశపరిచింది. మూడో భాగంలో మొదట తమన్నాను అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుండి తప్పుకుంది. సినిమా ముహూర్తానికి కూడా హాజరైన తమన్నా కథలో మార్పులు అంటూ డిమాండ్ చేయడంతో ఓంకార్ తప్పని పరిస్థితులలో తమన్నాను కాదని అవికా గోర్ ను ప్రధాన పాత్రలో తీసుకున్నాడు. దీనివల్ల ఓంకార్ కు బడ్జెట్ కూడా కలిసొచ్చినట్లైంది.

ప్రాంతం షేర్ (కోట్లలో)

నైజాం 1.84

సీడెడ్ 0.88

నెల్లూరు 0.18

కృష్ణ 0.33

గుంటూరు 0.34

వైజాగ్ 0.65

ఈస్ట్ 0.33

వెస్ట్ 0.24

మొత్తం 4.79

ఇప్పుడు రాజు గారి గది 3 హిట్ అవ్వడంతో నాలుగో పార్ట్ ను వెంటనే తెరకెక్కించడానికి సమాయత్తమవుతున్నారు దర్శకుడు ఓంకార్. ఈ సిరీస్ లో మరిన్ని సినిమాలు తీసుకురావాలని అనుకుంటున్నాడు. నాలుగో భాగంలో ప్రధాన పాత్రకు వెంకటేష్ ను తీసుకోవాలని యోచిస్తున్నాడు. మరి అది జరుగుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All