Homeటాప్ స్టోరీస్సరైనోడు చిత్రాన్ని క్రాస్ చేస్తున్న బన్నీ సినిమా

సరైనోడు చిత్రాన్ని క్రాస్ చేస్తున్న బన్నీ సినిమా

Allu Arjuns market increased with ala vaikunthapuramulo
Allu Arjuns market increased with ala vaikunthapuramulo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో చిత్రంతో బన్నీ రేంజ్ బాగా పెరిగింది. అల్లు అర్జున్ కెరీర్ బాగా ఊపందుకుందంటే అది జులాయి చిత్రంతోనే. ఆ చిత్రం 40 కోట్ల షేర్ సాధించడంతో ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. దాని తర్వాత ఒక రేంజ్ కు స్థిరపడిపోయిన బన్నీ మార్కెట్ తర్వాత సరైనోడు చిత్రంతో మరో రేంజ్ కు వెళ్ళింది. ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ మొదట్లో వచ్చినా కానీ మాస్ ఇమేజ్ బాగా వర్కౌట్ అవ్వడంతో దాదాపు 70 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

సరైనోడు తర్వాత ఆ స్థాయి సినిమా ఇంకా రాలేదు. నా పేరు సూర్య అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. డీజే చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయినా కానీ తర్వాత నిలవలేకపోయింది. తొలిరోజు నుండి ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సంక్రాంతి అడ్వాంటేజ్ ప్లస్ పాజిటివ్ టాక్ కలవడంతో అల వైకుంఠపురములో చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. సింగిల్ స్క్రీన్లు, మల్టిప్లెక్స్ లు, ఏ సెంటర్స్, బి సెంటర్స్ అన్న తేడా లేకుండా అల వైకుంఠపురములో కలెక్షన్స్ ను దున్నేస్తోంది.

- Advertisement -

ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల షేర్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా 58 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇంకా ఆ వారం ఎండ్ వరకూ అడ్వాన్స్ ఫుల్స్ అవ్వడంతో అల వైకుంఠపురములో చిత్రానికి ఎదురే లేకుండా దూసుకుపోతోంది. పోటీగా సరిలేరు నీకెవ్వరు చిత్రం ఉన్నా కానీ అల వైకుంఠపురములో ఎక్కడా తగ్గకపోవడం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All