Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

అల వైకుంఠపురములో 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

Ala Vaikunthapuramulo 4 Days Collections
Ala Vaikunthapuramulo 4 Days Collections

అసలైన సంక్రాంతి పండగ ఎలా ఉంటుందో తెలుగు ప్రేక్షకులు మరోసారి చూపించారు. మొదటినుండి పోటీ పడుతూ వస్తోన్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలకు వస్తున్న కలెక్షన్స్ నభూతో నభవిష్యత్ అన్న రేంజ్ లో వస్తున్నాయి. ముఖ్యంగా అల వైకుంఠపురములో చిత్రానికి వస్తున్న వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈ చిత్రానికి మొదటి రోజు 26 కోట్ల షేర్ వచ్చింది మొదలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల సునామీ సృష్టించింది.

రెండో రోజు నుండి 10 కోట్లకు తగ్గకుండా వసూళ్లు వస్తుండడం నిజంగా ఆశ్చర్యకరమే. రెండో రోజు 10 కోట్ల షేర్ ను నమోదు చేసిన ఈ చిత్రం మూడో రోజుకు వచ్చేసరికి 11.1 కోట్ల షేర్ నమోదు చేసింది. భోగి రోజు సెలవు కావడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ఇక నిన్న సంక్రాంతి కావడంతో అల వైకుంఠపురములో సంక్రాంతి వద్ద మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమా నిన్న ఏకంగా 11.28 కోట్ల షేర్ ను వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పింది. మొదటి నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వరసగా 10 కోట్ల షేర్ సాధించిన చిత్రం బాహుబలి 2 తప్ప మరొకటి లేదు. ఇప్పుడు అల వైకుంఠపురములో ఈ లిస్ట్ లో చేరింది.

- Advertisement -

ఈ చిత్ర నాలుగు రోజుల కలెక్షన్స్ బ్రేక్ డౌన్ :
నైజాం : 17.95 కోట్లు
సీడెడ్ : 9.25 కోట్లు
గుంటూరు : 5.94 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.92 కోట్లు
తూర్పు గోదావరి : 5.24 కోట్లు
పశ్చిమ గోదావరి : 4.03 కోట్లు
కృష్ణా : 5.38 కోట్లు
నెల్లూరు : 2.35 కోట్లు

ఆంధ్ర + తెలంగాణ: 58.06 కోట్లు

ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్లకు బిజినెస్ కాబడింది. అంటే ఈ లెక్కన అల వైకుంఠపురములో కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకోనుంది. ఈరోజు కనుమ సందర్భంగా కూడా సెలవు కావడంతో అల వైకుంఠపురములో వసూళ్ల సునామీ ఈరోజు కూడా కొనసాగనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All