Homeటాప్ స్టోరీస్ద‌శ‌ల వారీగా షూటింగ్‌లు .. థియేట‌ర్లకు..!

ద‌శ‌ల వారీగా షూటింగ్‌లు .. థియేట‌ర్లకు..!

ద‌శ‌ల వారీగా షూటింగ్‌లు .. థియేట‌ర్లకు..!
ద‌శ‌ల వారీగా షూటింగ్‌లు .. థియేట‌ర్లకు..!

క‌రోనా కార‌ణంగా చాలా రంగాలు తీవ్ర బ‌బ్బందుల‌కు గుర‌వుతున్నాయి. ఇందులో ముఖ్యంగా సినిమా రంగం మ‌రింత‌గా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. వేల మంది రోజు వారీ కార్మికుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. దీంతో లాక్‌డౌన్ మ‌రింత కాలం కొన‌సాగితే సంక్షో‌భం ముదురుతుంద‌ని భావించిన ఇండ‌స్ట్రీ వర్గాలు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ని ఈ రోజు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ప్ర‌త్యేకంగా క‌లిసి చిత్ర ప‌రిశ్ర‌మ‌పై సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర‌డం జ‌రిగింది.

లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ద‌శ‌ల వారీగా పున‌రుద్ద‌రిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు, కోవిడ్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌లు పాటిస్తూనే షూటింగ్‌లు నిర్వ‌హించేలా ఎవ‌రికి వారు నియంత్ర‌ణ పాటించాల‌ని, దీని కోసం విధి విధానాల‌ను రూపొందించాల‌ని ఆయ‌న అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

సిననీ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి ల‌క్ష‌లాది మంది ఆధార‌ప‌డి జీవిస్తున్నందున రీ ప్రొడ‌క్ష‌న్‌, షూటింగ్ నిర్వ‌హ‌ణ, థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లను ద‌శ‌ల‌వారీగా పున‌రుద్ధ‌రించాల్సిన అవ‌స‌రం వుంద‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. త‌క్కువ మందితో ఇండోర్‌లో చేసే వీలున్న రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ట ప్రారంభించుకోవాల‌ని, జూన్ నుంచి సినిమా షూటింగ్‌లు ప్రారంభించాల‌ని, చివ‌ర‌గా ప‌రిస్థితిని బ‌ట్టి సినిమా థియేట‌ర్లు పునః ప్రారంభంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్ర కేసీఆర్‌.

సీఎం‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన వారిలో సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌,  చిరంజీవి, నాగార్జున‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ, ‌దిల్‌రాజు, అల్లు అర‌వింద్‌, ఎన్‌. శంక‌ర్‌, త్రి‌విక్ర‌మ్ సి. క‌ల్యాణ్‌, డిజ సురేష్‌బాబు, నిరంజ‌న్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All