Homeటాప్ స్టోరీస్క్లైమాక్స్ మూవీ రివ్యూ

క్లైమాక్స్ మూవీ రివ్యూ

క్లైమాక్స్ మూవీ రివ్యూ
క్లైమాక్స్ మూవీ రివ్యూ

మూవీ రివ్యూ – క్లైమాక్స్

తారాగణంమియా మాల్కోవా తదితరులు

- Advertisement -

దర్శకులు – రామ్ గోపాల్ వర్మ

నిర్మాత – ఆర్ ఎస్ ఆర్ ప్రొడక్షన్స్, శ్రేయాస్ ఈటి

సినిమాటోగ్రాఫర్ – అగస్త్య మంజు

రేటింగ్‌ – 2/5

దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ శైలి వేరు. గత కొన్నేళ్లుగా హిట్ అన్నది లేని రామ్ గోపాల్ వర్మ తన చిత్రాలకు బజ్ తీసుకురావడంలో మాత్రం ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలో కూడా సినిమాను విడుదల చేయడంలో విజయవంతమయ్యాడు వర్మ. మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్ ను పెట్టి ఆమె అందచందాలను ప్రధానాస్త్రంగా క్లైమాక్స్ ను తెరకెక్కించాడు. మరి డైరెక్ట్ గా ఆన్లైన్ లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా?

కథ:

ఎడారిలో విహార యాత్రకు వెళ్లిన ఓ జంటకు కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయి. వింత మనుషులు వాళ్ళను వెంటాడుతుంటారు. దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అన్ని అడ్డంకులను దాటుకుని పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే వారికి మరింత పెద్ద సమస్య ఎదురవుతుంది. ఏంటది? దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అన్నది క్లైమాక్స్ కథ.

నటీనటులు :

మియా మాల్కోవా నటించడానికి చాలా కష్టపడింది. ఆమె అందచందాలు సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్. ఆమె లవర్ గా చేసినతను నటుడిగా తన స్థాయిని మెరుగుపరుచుకోవాలి. మిగతా వారి గురించి చెప్పడానికంటూ ఏమీ లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా ప్రస్తావించుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించే. వర్మ టేస్ట్ కు తగ్గట్లే కెమెరా వర్క్ సాగినా కూడా యాంగిల్స్ అవీ ఆకట్టుకుంటాయి. హారర్ థ్రిల్లర్ కు అవసరమైన మూడ్ ను కెమెరా సెట్ చేస్తుంది. అయితే ఎప్పుడో అవుట్ డేట్ అయిపోయిన సౌండ్ ఎఫెక్ట్స్ ను ఇందులో వాడాలనుకోవడం విడ్డూరమే. అవి భరించిన వారికి సహనం ఎక్కువ ఉన్నట్లే. ఇక దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పనితనాన్ని చూసి ఆయన ఫ్యాన్స్ మరోసారి నిరుత్సాహపడక తప్పదు. నిర్మాణ విలువల గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు.

విశ్లేషణ :

మాములుగా ఇలాంటి కథను ఒక 20 ఏళ్ల క్రితం వర్మ తీసి ఉంటే దాన్ని ఎలా డీల్ చేసి ఉండేవాడో ఏమో కానీ ఇప్పుడైతే వర్మలో సరుకైపోయిన విషయం క్లియర్ గా తెలుస్తోంది. దశాబ్దాల క్రితం నాటి స్టోరీతో వర్మ తీసిన ఈ చిత్రాన్ని భరించడం కష్టమే. మియా మాల్కోవా అందాలే చూడాలనుకుంటే దానికి వేరే దారులు చాలానే ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All