Homeటాప్ స్టోరీస్`క్లైమాక్స్‌`కి వ‌ర్మ రేట్ ఫిక్స్ చేశాడు!

`క్లైమాక్స్‌`కి వ‌ర్మ రేట్ ఫిక్స్ చేశాడు!

`క్లైమాక్స్‌`కి వ‌ర్మ రేట్ ఫిక్స్ చేశాడు!
`క్లైమాక్స్‌`కి వ‌ర్మ రేట్ ఫిక్స్ చేశాడు!

క‌రోనా కార‌ణంగా ఇండ‌స్ట్రీ ష‌డ్డౌన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. షూటింగ్‌లు లేవు, థియేట‌ర్లు లేవు.. ఆడియ‌న్స్ హంగామా లేదు. ఈ టైమ్‌ని వ‌ర్మ మాత్రం బాగానే ఉప‌యోగించుకుంటున్నాడు. థియేట‌ర్స్ లేక‌పోతేనేం సొంత ఓటీటీ వుందిగా అంటున్నాడు. లాక్‌డౌన్ టైమ్‌లోనూ రాకెట్ స్పీడుతో సినిమాలు చుట్టేస్తున్నాడు. రామ్‌గోపాల్‌వ‌ర్మ అగ‌స్త్య మంజుతో క‌లిసి వ‌రుస‌గా రెండు చిత్రాల్ని తెర‌పైకి తీసుకొచ్చాడు.

అందులో ఒక‌టి `క‌రోనా వైర‌స్‌` పేరుతో క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో తీస్తే మ‌రొక‌టి పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో చేసిన `క్లైమాక్స్‌`. ఇటీవ‌లే దీనికి సంబంధించిన టీజ‌ర్‌ని, ట్రైల‌ర్‌ని రిలీజ్ చేసి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేసిన వ‌ర్మ ఈ సినిమాని జూన్ 6న రాత్రి 9 గంట‌ల‌కు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నాడు.
RGVWorldTheatreలో రిలీజ్ కానున్న ఈ మూవీని చూడాలంటే ప‌ర్ వ్యూ కి 100 ఛార్జ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

- Advertisement -

బ్రేకింగ్ న్యూస్ మియా మాల్కోవా `క్లైమాక్స్` ఫుల్ ఫిల్మ్ జూన్ 6న RGVWorld.in/ShreyasET యాప్‌లో విడుద‌ల చేస్తున్నాం. పే ప‌ర్ వ్యూ ప‌ద్ద‌తిలో దీన్ని వీక్షించ‌వ‌చ్చు. లాగిన్ డిటైల్స్ త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం. రెండ‌వ ట్రైల‌ర్ ఈ నెల 30న 5 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌బోతున్నాం. అంతా క్లైమాక్స్ కోసం సిద్ధంగా వుండండి. 31న ఫేస్ బుక్ పేజీ ద్వారా నేను, మియా మాల్కోవా లైవ్‌లోకి వ‌స్తాం. క్లైమాక్స్ అనుభ‌వాల‌ని మీతో పంచుకుంటాం` అని వ‌ర్మ ట్వీట్ చేస్తూ ఓ పోస్టర్‌ని షేర్ చేశాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All