Homeటాప్ స్టోరీస్చిరు152లో హీరోయిన్ ఎవరో చెప్పరా?

చిరు152లో హీరోయిన్ ఎవరో చెప్పరా?

చిరు152లో హీరోయిన్ ఎవరో చెప్పరా?
చిరు152లో హీరోయిన్ ఎవరో చెప్పరా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న విషయం తెల్సిందే. షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ అవుతున్నాయి కానీ ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా జాయిన్ అవ్వలేదు. అసలు హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుండి త్రిష హీరోయిన్ అని అంటున్నారు. మీడియా కూడా అలాగే ఫిక్స్ అయిపోయింది. అయితే ఇంతవరకూ అధికారికంగా ఆ పేరుని మాత్రం ప్రకటించలేదు. హీరోయిన్ ఎవరన్నది తెలపడానికి ఇంత తాత్సారం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు.

ఇటీవలే ఒక మూవీ ఈవెంట్ లో చిరంజీవి ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేసిన సంగతి తెల్సిందే. ఆచార్య అనే పేరుని తెలిపాడు. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలను ముందుకు జరిపారని అంటున్నారు. హోలీ సందర్భంగా లేదా ఉగాది సందర్భంగా ఆచార్య ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఆచార్య షూటింగ్ ను జూన్ లేదా జులై కల్లా పూర్తి చేసి షూటింగ్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. 100 వర్కింగ్ డేస్ ను మించకుండా షూటింగ్ ను మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసారు కూడా. అయినా కూడా హీరోయిన్ ను ఇంకా ప్రకటించకపోవడం దేనికో అర్ధం కావడం లేదు. సందర్భం వచ్చినప్పుడు చెబుదాంలే అని దాచి ఉంచారా అన్నది తెలియాల్సి ఉంది.

మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికైన విషయం తెల్సిందే. ఇప్పటికే పాటల రికార్డింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక స్పెషల్ రోల్ లో ఎవరు చేస్తున్నారు – అది మహేష్ బాబునా లేక రామ్ చరణా అన్నది కూడా క్లారిటీ ఇవ్వాలి. పై రెండు కారణాలతో ఆచార్య గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ ఉంది. మరి ఆ వార్తలకు ప్రొడక్షన్ టీమ్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All