
కింగ్ నాగార్జున నటించిన చిత్రం `వైల్డ్ డాగ్`. 2007లో హైదరాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని `ఊపిరి` రైటర్ అహిషోర్ సాల్మన్ తెరకెక్కించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీఖేర్, అలీరెజా కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు నాగార్జున. అంతే కాకుండా మునుపెన్నడూ లేనంతగా ఈ సినిమాపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడం నాగ్‌కు అవసరం. ఈ నేపథ్యంలో టెన్షన్‌లో వున్న ఆయన గురువారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ ఇద్దరు హీరోలు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. నాగ్ తన ఇంటికి అతిథిగా రావడంతో చిరు ఆయన కోసం కమ్మని వంట చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని నాగ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
`వైల్డ్ డాగ్` విడుదల నేపథ్యంలో నా ఒత్తిడి తగ్గించేందుకు మెగాస్టార్ స్వయంగా వంట చేశారు. నా కోసం రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. ధన్యవాదాలు` అంటూ కింగ్ నాగార్జున తన ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇందులో విశేషం ఏంటంటే చిరు, నాగ్‌లు కిచెన్‌లో వున్న ఫొటోని చిరంజీవి సతీమణి సురేఖ తీయడం. ఈ విషయాన్ని కూడా నాగ్ వెల్లడించారు.
A delicious dinner Cooked by the megastar himself to cool my nerves for #WildDog release tomorrow !! Thank you For a wonderful evening @KChiruTweets ???? picture courtesy Surekha garu ???? pic.twitter.com/86FO5aWI1Q
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 1, 2021