
కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ `వైల్డ్ డాగ్`. అహిషోర్ సాల్మన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం వరల్డ్ వైడ్‌గా విడుదలవుతోంది. బాలీవుడ్ హీరోయిన్స్ దియా మీర్జా, సయామీఖేర్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని గురువారం రాత్రి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ మూవీని స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేకంగా వీక్షించింది.
`వైల్డ్ డాగ్`ను చూశాను .. ఇది చాలా అద్భుతంగా ఉంది. మంచి యాక్షన్ చిత్రాన్ని మిస్సయ్యాను. నాకు హాలీవుడ్ స్టైల్, కిక్కాస్ పవర్ ప్యాక్డ్, ఎమోషనల్ సీట్ ఎడ్జ్ యాక్షన్ ఫిల్మ్ ఇది .. దీన్ని తప్పకుండా చూడండి నాగార్జున తప్ప దీన్ని మరెవరూ చేయలేరు` అని తన మామ చిత్రానికి మినీ రివ్యూ ఇచ్చేసింది. దీంతో ఈ మూవీని ఎలాగైనా చూడాలని చాలా మంది సెలబ్రిటీస్ ఎదురుచూస్తున్నారు.
సమంత ప్రస్తుతం గుణశేఖర్ మైథలాజికల్ మూవీ `శాకుంతలం`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇక సమంత టెర్రరిస్ట్‌గా నెగెటివ్ ఛాయలున్న పాత్రలో నటించిన `ఫ్యామిలీమ్యాన్ 2` త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రలో నటించారు.