
మెగాస్టార్ చిరంజీవి సడెన్ గా తన కెరీర్ ను స్పీడప్ చేసాడు. వరసగా యంగ్ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తోన్న ఆచార్య పూర్తయ్యాక ఎక్కువ బ్రేక్ తీసుకోకుండా మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ ను మొదలుపెట్టబోతున్నాడు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో డ్యూయల్ రోల్ సినిమా ఉండనే ఉంది. మధ్యలో మెహెర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో నటిస్తాడు చిరంజీవి.
ఇవి కాకుండా ఇప్పుడు మరో సినిమాను మెగాస్టార్ ఓకే చేసాడు అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతి మెగాస్టార్ కు ఒక కథ వినిపించాడట. చిరుకి ఆ హిలేరియస్ ఎంటర్టైనర్ బాగా నచ్చేయడంతో వెంటనే పచ్చ జెండా ఊపేసినట్లు సమాచారం. మారుతి ఎప్పటినుండో మెగాస్టార్ తో పనిచేయాలనుకుంటున్నాడు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. మారుతి, అల్లు అరవింద్ తో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తాడు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే అధికారిక సమాచారం వస్తుందని తెలుస్తోంది.