
విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం నారప్ప ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెల్సిందే. ఈ సినిమా మంచి రివ్యూలనే సాధించింది. ముఖ్యంగా వెంకటేష్ పెర్ఫార్మన్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా వెంకటేష్ పెర్ఫార్మన్స్ కు ముగ్దుడైపోయినట్లు తెలిపాడు.
“నారప్ప చూసినప్పుడు నేను వెంకటేష్ ను చూడలేదు. ఆ పాత్రనే చూసాను. కచ్చితంగా ఈ సినిమాలో కొత్త వెంకటేష్ ను ఆవిష్కరించుకున్నాడు. నీలోని నటుడు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటాడు. దానికి నారప్ప మంచి ఉదాహరణ” అని చిరంజీవి ఆడియో క్లిప్ రూపంలో తన రెస్పాన్స్ ను తెలిపాడు.
“చిరంజీవి, నీ నుండి అభినందనలు ఎప్పుడూ నన్ను సంతోషింపజేస్తాయి. నారప్ప గురించి మంచి మాటలు చెప్పినందుకు థాంక్యూ” అని వెంకటేష్ దీనికి రెస్పాన్స్ ఇచ్చాడు. ప్రియమణి ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా నటించింది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు. సురేష్ బాబుతో కలిసి కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు.
Its a moment of happiness listening to every word of your appreciation @KChiruTweets. Overwhelmed and humbled for your feedback on Narappa. Thank you Chiranjeevi ???? pic.twitter.com/mS18fzEgfD
— Venkatesh Daggubati (@VenkyMama) July 23, 2021