
రచయిత, దర్శకుడు మారుతి చిన్న సినిమాలకు ఎప్పుడూ చేదోడుగా ఉంటాడు. ప్రతిరోజూ పండగే చిత్రం తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న మారుతి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ చిత్రాన్ని అనౌన్స్ చేసాడు. షూట్ కూడా మొదలైంది. అయితే ఈలోగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.
దీంతో మారుతి తన ఫ్రీ టైమ్ లో ఒక చిన్న కథపై వర్కౌట్ చేసాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరో, హీరోయిన్లుగా ఈ సినిమాను త్వరగా పట్టాలెక్కించాడు. షూట్ మొత్తం అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్ వేసి ప్లాన్ చేసాడు. ఇక్కడ విశేషం ఏంటంటే మంచి రోజులు వచ్చాయి షూట్ మొత్తం కేవలం 24 రోజుల్లోనే పూర్తి చేసేసాడు.
రీసెంట్ గా క్యారెక్టర్ ఇంట్రో వీడియో ఒకటి విడుదల చేసాడు. బోలెడు పాత్రలతో, పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం అందిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి 24 రోజుల్లోనే అంతమంది ఆర్టిస్ట్ లతో సినిమా చేయడం అంటే విశేషమే మరి.