Homeటాప్ స్టోరీస్`చెక్‌` మూవీ రివ్యూ

`చెక్‌` మూవీ రివ్యూ

`చెక్‌` మూవీ రివ్యూ
`చెక్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు :  నితిన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌, సాయిచంద్‌, సంప‌త్‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ముర‌ళీశ‌ర్మ‌, హర్ష‌వ‌ర్థ‌న్‌, రోహిత్ పాథ‌క్‌, సిమ్రాన్ చౌద‌రి త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం : చంద్ర‌శేఖ‌ర్ యేలేటి
నిర్మాత‌:  వి. ఆనంద‌ప్ర‌సాద్‌
సంగీతం: క‌ల్యాణీ మాలిక్‌
ఛాయాగ్ర‌హ‌ణం:  రాహుల్ శ్రీ‌వాత్స‌వ్‌
ఎడిటింగ్ : అన‌ల్ అనిరుద్ద‌న్
ఆర్ట్ :  వివేక్ అన్నామ‌లై‌‌
రిలీజ్ డేట్ : 26- 02- 2021
రేటింగ్ : 2.75/5

గ‌త ఏడాది ప్రారంభంలో `భీష్మ‌` వంటి ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు నితిన్‌. ప్రేమ క‌థా చిత్రాల‌తో ఆక‌ట్టుకుంటున్న ఈ హీరో విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న చంద్ర శేఖ‌ర్ యేలేటితో క‌లిసి సినిమా చేస్తున్నాడ‌న‌గానే ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది. ఉరిశిక్ష ప‌డిన ఖైదీ క‌థ స్ఫూర్తితో చంద్ర‌శేఖ‌ర్ యేలేటి రూపొందించిన ఈ చిత్రం టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో ఆక‌ట్టుకుంది. మ‌రి సిన‌రిమా అదే స్థాయిలో వుందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
ఉగ్ర‌వాదిగా ముద్ర‌ప‌డిన ఖైదీ ఆదిత్య (నితిన్‌). ఉరిశిక్ష ప‌డ‌టంతో రోజులు తెక్క‌పెడుతూ వుంటాడు. ఇంట‌లిజెంట్ అయిన‌టువంటి ఆదిత్య తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని, తాను ఉగ్ర‌వాదిని కాన‌ని కోర్టులో పిటీష‌న్ వేస్తాడు. ఈ కేసు నీ కెరీర్‌కి ఉప‌యోగ‌ప‌డుఉంద‌ని తండ్రి చెప్ప‌డంతో ఆదిత్య కేసుని వాదించ‌డానికి ముందుకొస్తుంది మాస‌న (ర‌కుల్ ప్రీత్ సింగ్‌). కోర్టులో కేసు హియ‌రింగ్‌లో వుండ‌గానే ఆదిత్య శ్రీ‌మ‌న్నారాయ‌ణ (సాయిచంద్‌) అనే ఖైదీ వ‌ల్ల చెస్ నేర్చుకుంటాడు. కోర్టులో దారుల‌న్నీ మూసుకుపోవ‌డంతో రాష్ట్ర‌ప‌తి నుంచి క్ష‌మాభిక్ష కోసం ఎదురుచూస్తుంటారు. మ‌రి కొన్ని గంట‌ల్లో ఉరిశిక్ష ప‌డాల్సిన ఆదిత్య ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? .. అత‌నికి చెస్ ఎలా వుప‌యోగ‌ప‌డింది? .. ఇంత‌కీ యాత్ర‌కు ఆదిత్య‌కు వున్న సంబంధం ఏంటీ? అన్న‌ది తెలియాటంటే సినిమా చూడాల్సిదే.

న‌టీన‌టుల న‌ట‌న‌:
నితిన్ త‌న పంథాకు భిన్నంగా చేసిన చిత్ర‌మిది. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే నితిన్ వ‌న్ మేన్ షో. ఉరిశిక్ష ప‌డిన ఖైదీగా అత్యంత స‌హ‌జ‌త్వంతో కూడిన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ పాత్ర‌లో చ‌క్క‌ని భావోద్వేగాల్ని పండించారు. ఇక ర‌కుల్ మాన‌స అనే న్యాయ‌వాది పాత్ర‌లో న‌టించింది. కానీ ఆమె పాత్ర‌కున్న ప్రాధాన్య‌త చాలా త‌క్కువే. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర‌లో న‌టించింది. పాత్ర చిన్న‌దే అయినా క‌థ‌కు కీల‌కంగా నిలిచింది. సాయిచంద్‌, సంప‌త్‌రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ముర‌ళీశ‌ర్మ‌, హర్ష‌వ‌ర్థ‌న్‌, రోహిత్ పాథ‌క్‌, సిమ్రాన్ చౌద‌రి త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించి ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా వుంది. సంగీత ద‌ర్శ‌కుడు క‌ల్యాణీ మాలిక్ అందించిన నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. రాహుల్ శ్రీ వాత్స‌వ ఛాయాగ్ర‌హ‌ణం, వివేక్ క‌ళా ప్ర‌తిభ‌, న‌రేష్ అందించిన మాట‌లు క‌థ‌కు బాలాన్ని చేకూర్చాయి. విభిన్న క‌థా చిత్రాల‌తో ఆక‌ట్టుకునే ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి మ‌రోసారి `చెక్‌` మూవీతో స‌రికొత్త క‌థ‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. అయితే ఆయ‌న మార్కు, క‌థ‌, క‌థనాలు పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు:
వాణిజ్య హంగులంటూ ప్ర‌త్యేక‌మైన జోడింపులు లేకుండా ఓ క‌థ‌ని క‌థ‌లా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఆరంభ స‌న్నివేశాల‌తోనే క‌థ‌లోకి ప్రేక్ష‌కుడిని ఎంట‌ర‌య్యేలా చేశారు చంద్ర‌శేఖ‌ర్‌ యేలేటి. అయితే చెస్ ఆట మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి క‌థ ర‌క్తి క‌ట్టింది. అయితే క‌థ‌లో సాగ‌దీత స‌న్నివేశాలు, ఊహ‌కందే క‌థ‌, క‌థ‌నాలు వంటి కొన్ని లోపాలున్నా నితిన్ న‌ట‌న, క‌థా నేప‌థ్యం, ప‌తాక స‌న్నివేశాలు ఆకట్టుకుంటాయి. చంద్ర శేఖ‌ర్ యేలేటి మార్కులో లేక‌పోయినా కొంత వర‌కు ఆక‌ట్టుకునే చిత్ర‌మిది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All