Homeటాప్ స్టోరీస్"ఉమ్మ- లక లక లక" మళ్ళీ వస్తున్నారు..కుదిరితే ఇంకొక సినిమా

“ఉమ్మ- లక లక లక” మళ్ళీ వస్తున్నారు..కుదిరితే ఇంకొక సినిమా

"ఉమ్మ- లక లక లక" మళ్ళీ వస్తున్నారు..కుదిరితే ఇంకొక సినిమా
“ఉమ్మ- లక లక లక” మళ్ళీ వస్తున్నారు..కుదిరితే ఇంకొక సినిమా

రజనీకాంత్ గారు ప్రస్తుతం ‘దర్బార్‘ సినిమా ముగించుకొని ఉత్తర భారత యాత్రలు చేసుకుంటున్నారు. ఇటీవలే రిషికేష్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన రజినికాంత్ గారు అటునుండి హిమాలయలకి వెళ్లి సేద తీరుతారు. ఇంకా 10 రోజుల పాటు హిమాలయాలు అలాగే అక్కడ ప్రకృతి అందాలని ఆస్వాదించి తీరికగా ఇంటికి వచ్చి మరి కొన్ని రోజులు సమయం తీస్కొని వెంటనే తదుపరి సినిమాకి సిద్ధం అవుతారు.

దర్బార్ సినిమాని చాల తక్కువ సమయంలో పూర్తి చేసిన రజినీకాంత్ గారు తదుపరి సినిమా తమిళ మాస్ దర్శకులు శివ గారికి అవకాశం ఇచ్చారు. సన్ పిక్చర్స్ అధినేతలు రజినీకాంత్ గారి 168 సినిమాని నిర్మించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కథా నాయికగా రజినీకాంత్ గారి పక్కన సరిగ్గా ఇమడగలిగే పాత్రకి మొదట ఎవ్వరిని అనుకోలేదూ. తీరా ఇప్పుడు చేస్తే ఇద్దరి పేర్లు లిస్ట్ లోకి వచ్చాయి. వారిలో ఒకలు ‘సూర్య’ గారి సతీమణి ‘జ్యోతిక’ గారు, ఇంకొకలు మలయాళ నటి ‘మంజు వారియర్’ గారు.

- Advertisement -

జ్యోతిక మరియు మంజు వారియర్ ఇద్దరు తమ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టారు. మంజు వారియర్ నటించిన ‘అసురన్’ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తుంది. అందుకని మంజు వారియర్ గారు అని అనుకుంటున్నారు. ఇక జ్యోతిక గారి విషయానికి వస్తే వారు కూడా ఇటీవలే సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఒకవేళ జ్యోతిక గారు రజినీకాంత్ గారి పక్కన నటిస్తే ‘చంద్రముఖి’ సినిమా తర్వాత మరొకసారి ఇద్దరు కలవబోతారు ఈ సినిమాకి అని అనుకుంటున్నారు….

ఇక చూస్కుంటే రజనీకాంత్- ఏ.ఆర్.మురగదాస్ గారి కలయికలో వస్తున్న దర్బార్  సినిమాలో నయనతార గారు కథానాయిక. నయనతార గారు కూడా చంద్రముఖి సినిమాలో చేయడం మన అందరం చూసేసాం. ఇక వరుసగా ఒకొక్క సినిమాకి  చంద్రముఖి సినిమా కథానాయికలతో నటించడం రజినీకాంత్ గారికి చంద్రముఖి తర్వాత అంత పెద్ద విజయం ఈ రాబోయే సినిమాల ద్వారా దక్కుతుంది అని అనుకుంటున్నారు తలైవా అభిమానులు.

దర్బార్ సినిమా 2020 సంక్రాంతి సందర్బంగా జనవరి 10 న లేదా 11 విడుదల చెయ్యాలి అనుకుంటున్నారు. తర్వాత చేయబోయే సినిమాలో దర్శకులు శివ గారు మంజు వారియర్ మరియు జ్యోతిక ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో? కుదిరితే కథ కి అనుకూలంగా ఇద్దరినీ తీసుకుంటారో? అన్నది తెలియాలీ అంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే……

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All