Homeటాప్ స్టోరీస్168 సినిమాలు తొందరగా ఎలా చేసాడు అనడం కంటే సింపుల్ గా 'రజినీకాంత్' అనాలి....

168 సినిమాలు తొందరగా ఎలా చేసాడు అనడం కంటే సింపుల్ గా ‘రజినీకాంత్’ అనాలి….

Rajnikanth
Rajnikanth

తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల వారికి కావాల్సిన వారు మన తలైవా సూపర్ స్టార్ ‘రజినీకాంత్‘ గారు. తెలుగు, తమిళ, హిందీ లో కలిపి 167 సినిమాలో నటించిన తలైవా ఇప్పుడు 168 సినిమాకి ముహూర్తం కుదిరింది. ఇన్ని సినిమాలు ఎలా చేయగలిగారు అది కూడా తక్కువ సమయంలో అంటే ఆయన పట్టుదల ముందు ఇవన్నీ జుజుబీ అంటున్నారు తలైవా ఫ్యాన్స్.

167 చిత్రంగా తెరకెక్కిన ‘దర్బార్’ సినిమా వారం రోజుల ముందే షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. సినిమాకి మురుగదాస్ దర్శకులు. సినిమాలో రజనీకాంత్ గారు పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. సినిమా సంక్రాంతి 2020 కానుకగా 14 జనవరి న విడుదల కాబోతుంది. ఇక 168 సినిమాకి దర్శకులుగా శివ గారు వ్యవహరించనున్నారు. సినిమాకి నిర్మాతలు సన్ పిక్చర్స్ వాళ్ళు.

- Advertisement -

దర్శకులు శివ గారు రజనీకాంత్ గారికి దర్బార్ షూటింగ్ జరుగుతున్నప్పుడే కథ చెప్పడం జరిగింది. కథ కూడా బాగుంది అనడంతో సన్ పిక్చర్స్ వారు నిర్మాతలుగా మారారు. దర్శకులు శివ గత సినిమాలు చూసుకుంటే అజిత్ గారితో కలిసి వరుసగా ‘వీరం’, ‘వేదలమ్’, ‘వివేకం’, ‘విశ్వాసం’ సినిమాలని మాస్ కమర్షియల్ సినిమాలుగా మరిచారు. తెలుగులో కూడా ‘శౌర్యం’, ‘శంఖం’, ‘దరువు’ సినిమాలని తీశారు.

శివ-రజినీకాంత్ సినిమా గురించి తెలిసిన తలైవా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అజిత్ గారిని మలిచినట్లే రజినీకాంత్ గారిని కూడా ఒక మాస్ మసాలా హీరోగా చూపిస్తారు అని అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా సన్ పిక్చర్స్ వాళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇలా అన్నారు….”బ్లాక్ బస్టర్ ఏంథిరన్ (రోబో) మరియు పేటా  తరువాత……సన్ పిక్చర్స్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ గారి మెగా హిట్ కాంబో మరియు సూపర్ స్టార్ తదుపరి చిత్రం తలైవర్ 168 కోసం మూడవసారి కలిసినందుకు సంతోషంగా ఉంది” అని అన్నారు.

తొందరలోనే సినిమాకి ముహూర్తం కార్యక్రమాలు చూసుకొని మిగిలిన తారాగణం, ఇతరత్రా వివరాలను తెలియ చేస్తాం అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All