
యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ చాణక్య అక్టోబర్ 5న విడుదలవుతున్న విషయం తెల్సిందే. ఒకవైపు సైరా విడుదలకు ఉందని తెలిసినా చాణక్య నిర్మాతలు ధైర్యంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు వచ్చారు.
ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ గ్రాఫ్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. అయినా కానీ చాణక్య సినిమాకు బిజినెస్ బాగా జరిగింది. నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 15 కోట్ల వరకూ వచ్చాయి.
ప్రస్తుతం సైరా విడుదలై సూపర్ హిట్ టాక్ తో నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్స్ తో నడుస్తోంది. ఈ నేపథ్యంలో చాణక్య ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఆసక్తికరం. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చి క్లియర్ చేసారు.
మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. తిరు ఈ చిత్రానికి దర్శకుడు. అనిల్ సుంకర నిర్మాణంలో చాణక్య తెరకెక్కింది.