
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలు పాజిటివ్ గా ఉండి, ప్రేక్షకుల మొదటి స్పందన కూడా అదిరిపోవడంతో సైరా ప్రభంజనం సృష్టిస్తోంది. అన్ని చోట్లా రికార్డు కలెక్షన్లు సాధిస్తూ మెగాస్టార్ రేంజ్ ను ఈ తరం వారికి తెలియజెప్పేలా చేసింది.
సైరా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 38.73 కోట్ల షేర్ సాధించింది. చాలా ప్రాంతాల్లో బాహుబలి 2 తప్ప మిగిలిన అన్ని చిత్రాల రికార్డులను ఈ చిత్రం తిరగరాసింది. కృష్ణ, వైజాగ్ ప్రాంతాల్లో అయితే ఆల్ టైమ్ వసూళ్లను సాధించింది. ఈ రెండు ప్రాంతాల్లో బాహుబలి 2 ను కూడా తిరగరాసింది.
సైరా నరసింహారెడ్డి మొదటి రోజు వసూళ్ల బ్రేక్ డౌన్ ఇక్కడ చూద్దాం :
ప్రాంతం షేర్ (కోట్లలో)
నైజాం 8.10
సీడెడ్ 5.90
నెల్లూరు 2.09
కృష్ణ 3.03
గుంటూరు 5.06
వైజాగ్ 4.72
తూర్పు గోదావరి 5.34
పశ్చిమ గోదావరి 4.50
1ST DAY AP & TS SHARE 38.73
కర్ణాటక 6.50
తమిళనాడు 0.60
కేరళ 0.25
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.30
ఓవర్సీస్ 6.50
TOTAL WW SHARE 53.88