Homeరివ్యూస్ఛలో రివ్యూ

ఛలో రివ్యూ

chalo-telugu-movie-reviewనటీనటులు : నాగశౌర్య , రష్మిక మందాన , నరేష్ , పోసాని
సంగీతం :
మహతి
నిర్మాత :
ఉషా మూల్పూరి
దర్శకత్వం :
వెంకీ కుడుముల
రేటింగ్ :
3. 25/ 5
రిలీజ్ డేట్ :
2 ఫిబ్రవరి 2018

లవ్ ఎంటర్ టైనర్ లతో ప్రేక్షకులను అలరించిన హీరో నాగశౌర్య , అయితే ఈసారి సొంత చిత్ర నిర్మాణం చేపట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . వెంకీ కుడుముల ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ ఛలో చిత్రంతో సక్సెస్ కొట్టాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

- Advertisement -

కథ :

చిన్నప్పటి నుండి గొడవలంటే హరి (నాగశౌర్య ) చాలా ఇష్టం , దాంతో పెద్దయ్యాక కూడా తండ్రి కి (నరేష్ ) మనశ్శాంతి లేకుండా చేస్తాడు దాంతో ఇక వీడిని హైదరాబాద్ లో ఉంచితే ప్రమాదమని భావించి ఒకే గ్రామంలో శత్రువుల్లా ఉండే ” తిరుప్పూరు ” అనే గ్రామానికి పంపిస్తాడు . అక్కడ కార్తీక ( రష్మిక ) ని చూసి లవ్ లో పడతాడు హరి . అసలు ఆ గ్రామంలో తెలుగు వాళ్లకు , తమిళ వాళ్లకు ఉన్న గొడవ ఏంటి ? అక్కడికే హరిని ఎందుకు పంపాడు ? కార్తీక ఎవరు ? చివరకు హరి ఏం చేసాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

నాగశౌర్య నటన
రష్మిక మందాన
ఎంటర్ టైన్ మెంట్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

నాగశౌర్య నటన చాలా సహజంగా ఉంది , హరి పాత్రలో మరింత మెరుగ్గా నటించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు . సహజంగానే నాగశౌర్య అందగాడు ఇక ఈ చిత్రంలో మరింత అందంగా కనిపించాడు . రష్మిక మందాన అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకుంది . తండ్రి పాత్రలో నరేష్ సరిగ్గా సరిపోయాడు , అలాగే కామెడీ టచ్ తో తల్లి పాత్రలో ప్రగతి మెప్పించింది .వెన్నెల కిషోర్ , రఘుబాబు ,వైవా హర్ష ,పోసాని , సత్య , శ్రీను తదితరులంతా తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

ఐరా నిర్మాణ విలువలు బాగున్నాయి , తనయుడి కి బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్న కృతనిశ్చయంతో ఈ సినిమాని రూపొందించినట్లు ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది . మహతి అందించిన పాటలు బాగున్నాయి ముఖ్యంగా చూసి చూడంగానే పాట హైలెట్ గా నిలిచింది . సాయి శ్రీరామ్ ఈ సినిమాని మరింత రిచ్ గా చూపించాడు ముఖ్యంగా హీరో హీరోయిన్ లను . ఇక దర్శకుడు వెంకీ కుడుముల విషయానికి వస్తే …….. ఫస్టాఫ్ ని ఎంటర్ టైన్ మెంట్ తో బాగానే నడిపించాడు అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి సీరియస్ అంశాన్ని తేలిగ్గా తీసుకోవడం మాత్రం లాజిక్ కి అందదు . అయినప్పటికీ ఆ అంశాన్ని పక్కన పెడితే హాయిగా ఛలో అంటూ నవ్వుకునే సినిమా తీసాడు మొదటి ప్రయత్నంలోనే .

ఓవరాల్ గా :

పోలో మంటూ ఛలో థియేటర్ కు వెళ్లడమే తరువాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All