Homeగాసిప్స్అల వైకుంఠపురములో తొలి ఓటమి.. కౌంటర్ ప్లాన్ చేసిన బన్నీ

అల వైకుంఠపురములో తొలి ఓటమి.. కౌంటర్ ప్లాన్ చేసిన బన్నీ

bunny new plans after OMG Daddy song failure
bunny new plans after OMG Daddy song failure

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాన్ని బాగా ఓన్ చేసుకున్నాడు. సాధారణంగా హీరోలు షూటింగ్ చేయడం, సినిమాను ప్రమోట్ చేయడం వరకూ చేసి ఊరుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం అల వైకుంఠపురములో విషయంలో ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాడు. ప్రత్యేకంగా ప్రమోషన్స్ విషయంలో ప్రతిదీ తను డిజైన్ చేస్తున్నాడు. అసలు అల వైకుంఠపురములో చిత్రానికి నాలుగు నెలల ముందు నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టాలన్న ఐడియా అల్లు అర్జున్ దే.

అలాగే ప్రమోషన్స్ విషయంలో అగ్రసివ్ గా వెళ్లాలన్న నిర్ణయం కూడా బన్నీనే తీసుకున్నాడు. అలాగే ఏ పాట ఎప్పుడు, ఎలా రిలీజ్ చేయాలి అన్నది, ప్రతి పాట మ్యూజిక్ వీడియోలా చేయాలన్న ఆలోచన, ప్రతి మ్యూజిక్ వీడియోలోనూ సిగ్నచర్ స్టెప్ అనేది కచ్చితంగా ఉండాలన్న ఆలోచనలు మొత్తం బన్నీవే.

- Advertisement -

అయితే ఇప్పటిదాకా ఈ ఐడియాలు అన్నీ సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అల వైకుంఠపురములో చిత్రంలోని మొదటి రెండు పాటలకు వచ్చిన రెస్పాన్స్ నభూతో నభవిష్యత్ అన్న రేంజ్ లో ఉంది. ఇప్పటికీ ఈ రెండు పాటలు టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. సమజవరగమన సాంగ్ అయితే 95 మిలియన్ వ్యూస్ సాధించింది. 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. రాములో రాముల సాంగ్ కూడా తక్కువేం తినలేదు. దీనికి 65 మిలియన్ వ్యూస్ టచ్ అయ్యాయి.

ఈ రెండు సాంగ్స్ లో సిగ్నచర్ స్టెప్స్ టిక్ టాక్ వంటి యాప్స్ లో ప్రేక్షకులకు ఫెవరెట్ అయ్యాయి. ఇప్పటికే వేల మంది ఈ స్టెప్స్ తో వీడియోస్ చేస్తున్నారు. వీటన్నటి కంటే ముందు టైటిల్ అనౌన్స్ చేసిన గ్యాప్ వచ్చింది అని అల్లు అర్జున్ చెప్పే చిన్న బిట్ కూడా అందరికీ తెగ నచ్చేసింది. దీంతో అల వైకుంఠపురములో గత రెండు నెలల నుండి టాప్ లో ట్రెండ్ అవుతోంది.

అల వైకుంఠపురములో దెబ్బకి సరిలేరు నీకెవ్వరు టీమ్ పాటలు విడుదల చేయడానికి భయపడే పరిస్థితి నెలకొంది. ఎక్కడ పాట విడుదల చేస్తే అల వైకుంఠపురములో రేంజ్ కి మ్యాచ్ అవ్వక ట్రోల్స్ ఎదుర్కోవాలో అని చెప్పి పాటలు విడుదల చేయకుండా ముందు టీజర్ రిలీజ్ చేసారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అది వేరే విషయం లెండి. అయితే అల వైకుంఠపురములో నుండి వచ్చిన మూడో పాట ఓ మై గాడ్ డాడీ మాత్రం ప్లాపైందని చెప్పాలి.

రీసెంట్ గా రిలీజైన ఈ పాట ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ఓకే అనిపించింది. నెమ్మదిగా పిక్ అవుతుందిలే అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు. తొలిసారి తమ స్ట్రాటజీ ఫెయిల్ అయిందని ఆలోచించిన బన్నీ త్వరగానే మరో ప్లాన్ తో ముందుకు వచ్చాడు. డిసెంబర్ సెకండ్ వీక్ లో విడుదల చేయాలని భావించిన నాలుగో పాటను మరో వారం రోజుల్లో విడుదల చేయాలని ఇప్పుడు భావిస్తున్నారు. ఏదేమైనా సినిమాపై ఉన్న బజ్ మాత్రం తగ్గకూడదు అన్నది బన్నీ ఆలోచన. మరి ఈ నాలుగో పాట హిట్ అనుకున్న స్థాయిలో హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All