Homeగాసిప్స్అల్లు అర్జున్ కు బ్యాడ్ టైమ్ రిలీజ్ ఇది!

అల్లు అర్జున్ కు బ్యాడ్ టైమ్ రిలీజ్ ఇది!

అల్లు అర్జున్ కు బ్యాడ్ టైమ్ రిలీజ్ ఇది!
అల్లు అర్జున్ కు బ్యాడ్ టైమ్ రిలీజ్ ఇది!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్రానికి ప్రమోషన్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయని చెప్పడానికి ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. అల వైకుంఠపురములో చిత్రంలో విడుదలైన మొదటి రెండు పాటలు ఇన్స్టంట్ గా కనెక్ట్ అయి యూట్యూబ్ లో చార్ట్ బస్టర్స్ గా నిలిచిన విషయం తెల్సిందే. సామజవరగమన ఇప్పటికే 93 మిలియన్ వ్యూస్ తెచ్చుకోగా, 1 మిలియన్ లైక్స్ ను కూడా సాధించింది. రాములో రాముల సాంగ్ 63 మిలియన్ వ్యూస్ ను దాటి ఇంకా ట్రేండింగ్ లోనే ఉంది. ఈ రెండు పాటలతో అల వైకుంఠపురములో మీద చాలా పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెల్సిందే. ఈ సినిమా జనవరి 12న విడుదలవుతుండగా దానికి పోటీగా వస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ప్రమోషన్స్ లేవని అందరూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

ఈ నేపథ్యంలో అల వైకుంఠపురములో నుండి మూడో పాట ఓ మై గాడ్ డాడీ సాంగ్ విడుదలైంది. ఇది ఇన్స్టంట్ గా ఎక్కే పాట కాదు. అయినా ఇది కొంచెం సాధారణంగానే అనిపించింది. దాంతో మొదటి, రెండు పాటలకు వచ్చిన క్రేజ్ దీనికి రాలేదు. పైగా ఈ సాంగ్ విడుదలవ్వడానికి కొన్ని నిమిషాల ముందే సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదలై సోషల్ మీడియాను కమ్మేసింది. దాంతో ఈ పాటకు పెద్దగా హైప్ రాలేదు. నిజానికి అల వైకుంఠపురములో టీమ్ ముందే ఈ పాటను 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దాని తర్వాత రెండు రోజులకు సరిలేరు నీకెవ్వరు టీజర్ 22న వస్తోందని ఆ టీమ్ ప్రకటించింది. రెండు అప్డేట్స్ కు మధ్య గంట తేడా ఉన్నా కానీ టెక్నీకల్ కారణాల వల్ల ఓ మై గాడ్ విడుదల ఆలస్యమైంది. ఈలోగా సరిలేరు టీజర్ వచ్చేసింది. దాంతో ఓ మై గాడ్ డాడీ సాంగ్ కు రిలీజ్ టైమ్ బ్యాడ్ అయిందని చర్చించుకుంటున్నారు. దీనివల్ల తొలిసారి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో మీద పైచేయి సాధించినట్లైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All