Homeటాప్ స్టోరీస్రికార్డులకోసం పాకులాడుతున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో

రికార్డులకోసం పాకులాడుతున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో

Records Hungama for Sarileru Neekevvaru and Ala Vaikunthapuramulo
Records Hungama for Sarileru Neekevvaru and Ala Vaikunthapuramulo

అరవ ప్రేక్షకులు ఏ విషయంలోనైనా అతిగా స్పందిస్తారన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా అక్కడ జరిగే ఫ్యాన్ వార్స్ మరో లెవెల్ లో జరుగుతుంటాయి. అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య అయితే ఈ సోషల్ మీడియా వార్ పరాకాష్టకు చేరుకుంటోంది. అసలు చెప్పుకోవడానికి కూడా వీలు లేని పదాలతో హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి అది నేషనల్ వైడ్ లో ట్రెండ్ చేసి మరీ పరువు తీసుకుంటుంటారు. మా హీరో గొప్ప అనే దగ్గరనుండి పర్సనల్ లెవెల్ కు వెళ్ళిపోయి మరీ టార్గెట్ చేసి తిట్టుకుంటుంటారు. ఇదంతా మా హీరో ఈ రికార్డు కొట్టాడు అన్న దగ్గరనుండి మొదలవుతుంది. ఇప్పుడు ఇదే జాడ్యం తెలుసు ప్రేక్షకులకు కూడా అంటుకున్నట్లుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు తెలుసు ప్రేక్షకుల మధ్య సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల విషయంలో ఇలాంటి సోషల్ మీడియా వార్ నడుస్తోంది.

అయితే ఇది ఫ్యాన్స్ మొదలుపెట్టారు అనేదానికంటే హీరోలు, దర్శకులు, ప్రొడక్షన్ హౌస్ ల నుండే మొదలవుతుండడం విచారకరం. మా సినిమాలో పాటకు ఇన్ని లైక్స్ వచ్చాయి, మా సినిమా టీజర్ కు ఇన్ని వ్యూస్ వచ్చాయి. మా పాటకొచ్చినన్న వ్యూస్ ఇక మరే పాటకూ రాలేదని ఒకరు అంటే, మా పాటకు వచ్చినన్ని లైక్స్ అత్యధికం అని మరొకరు, మా టీజర్ ఉన్న రికార్డులు అన్నిటినీ బ్రేక్ చేసేసిందని వేరొకరు.. ఇలా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో విషయంలో ప్రచారం చేస్తోన్న రికార్డుల గోల ఒక రకంగా వెగటు పుట్టిస్తోందని చెప్పాలి. ఈరోజుల్లో అల్లాటప్పా పాట లేదా టీజర్ రిలీజైనా కూడా మిలియన్ వ్యూస్ రావడం అనేది సర్వసాధారణమైపోయింది. పైగా ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సోషల్ మీడియా బ్యాచ్ ఒకటి ఉంటోంది. వారి పని ఏదైనా వీడియో విడుదలైతే దానికి ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేయడమే, లైక్స్ పెంచేలా చూడటమే. ఇందులో చాలా మటుకు ఫేక్ కూడా ఉండొచ్చు.

- Advertisement -

అయితే మిలియన్ వ్యూస్ ఇన్ని నిమిషాల్లో వచ్చేశాయని, గంటగంటకూ ఎన్ని వ్యూస్ వస్తున్నాయో పోస్టర్ తో సహా వేసి చెప్పడం మరీ కామెడీగా అనిపిస్తోంది. ఇందులో హీరోలు కూడా ఇన్వాల్వ్ అవ్వడం మరీ దిగజారుడుతనంగా మారింది. ఇవి పట్టుకుని ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ఇరు వర్గాల హీరోల ఫ్యాన్స్ కొట్టుకోవడం మొదలవుతోంది. ఫ్యాన్స్ రికార్డుల గురించి డప్పు కొట్టుకుంటే ఒక అర్ధం ఉంటుంది, కానీ హీరోలు ఇన్వాల్వ్ అవ్వడం అనేదే అర్ధం కాని అంశంగా మారింది. మరి ఈ జాడ్యం తెలుగు సినిమాలను ఎప్పుడు వీడుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All