Saturday, October 1, 2022
Homeటాప్ స్టోరీస్బ‌న్నీ మ‌ల‌యాళ మంత్రం!

బ‌న్నీ మ‌ల‌యాళ మంత్రం!

బ‌న్నీ మ‌ల‌యాళ మంత్రం!
బ‌న్నీ మ‌ల‌యాళ మంత్రం!

బ‌న్నీ మ‌ల‌యాళ మంత్రం జ‌పిస్తున్నాడు. గ‌త ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి సంద‌డి చేసిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం ఊహించిన‌ట్టుగానే ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. త‌మ‌న్ సంగీతం, త్రివిక్ర‌మ్ టేకింగ్‌, అల్లు అర‌వింద్‌, చిన‌బాబుల రాజీ లేని మేకింగ్ ఈ సినిమాని టాప్‌లో నిల‌బెట్టాయి. ఎక్క‌డ చూసినా ఈ మూవీ గురించే మాట్లాడుకునేలా చేశాయి.

- Advertisement -

అ చిత్రంలో బ‌న్నీకి తండ్రిగా మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రామ్ న‌టించారు. త‌న‌కు మ‌ల‌యాళ మార్కెట్‌లో మంచి క్రేజ్ వుండ‌టంతో జ‌య‌రామ్ న‌టించ‌డం మ‌రింతగా ప్ల‌స్ అయింది. తాజా చిత్రానికి కూడా ఇదే ఫార్ములాని ఉప‌యోగిస్తున్న‌ట్టున్నాడు బ‌న్నీ. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ‌తెర‌కెక్కిస్తున్న చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో విల‌న్ పాత్ర కోసం చాలా రోజులుగా చిత్ర బృందం అన్వేషిస్తోంది. తాజాగా మల‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ‌ఫహ‌ద్ ఫాజిల్‌ని ఫైన‌ల్ చేసుకున్నారు.

ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బ‌న్నీ గంధ‌పు చెక్క‌ల స్ల‌గ్లింగ్ చేసే లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ గా ఊర మాస్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. శేషాచ‌లం అడువుల నేప‌థ్యంలో సాగే ఈ మూవీ చిత్రీక‌ర‌ణ దశ‌లో వుంది. ఆగ‌స్టు 13న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు. బ‌న్నీ మ‌ల‌యాళ మంత్రం మ‌రోసారి మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts