Homeటాప్ స్టోరీస్విజ‌య్ క్రేజీ ప్రాజెక్ట్ వెన‌క బ‌న్నీ?

విజ‌య్ క్రేజీ ప్రాజెక్ట్ వెన‌క బ‌న్నీ?

విజ‌య్ క్రేజీ ప్రాజెక్ట్ వెన‌క బ‌న్నీ?
విజ‌య్ క్రేజీ ప్రాజెక్ట్ వెన‌క బ‌న్నీ?

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. పూరి, చార్మిల‌తో పాటు ఈ చిత్రానికి క‌ర‌ణ్ జోహార్ వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణకు క‌రోనా వైర‌స్ కార‌ణంగా బ్రేక్ ప‌డింది. త్వ‌ర‌లో స్టార్ట్ చేయాల‌నుకున్నా ఈ మూవీ కోసం చైనీస్ బాక్స‌ర్ కావాట‌.

ఇదిలా వుంటే విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా ఉన్న‌ట్టుండి షాకిచ్చారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్ట్ ని చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రం ద్వారా ఫాల్క‌న్ మోట‌ర్స్‌కి చెందిన కేదార్ సెల‌గం శెట్టి నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇత‌ను విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మిత్రుడే. అలాగే బ‌న్నీకి కూడా మిత్రుడే అని తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి ప్రొడ్యూస‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్న కేదార్ ని బ‌న్నీ స్వ‌యంగా అభినందించారు.

- Advertisement -

దీంతో ఈ ప్రాజెక్ట్ వెన‌క బ‌న్నీ వున్నాడ‌ని, అత‌ని కార‌ణంగానే సుకుమార్ కూడా వ‌చ్చాడ‌ని ప్ర‌చారం మొద‌లైంది. గీతా ఆర్ట్స్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ ట్యాక్సీవాలా తో పాటు గీత గోవిందం వంటి హిట్ చిత్రాల్ని అందించాడు. అప్ప‌టి నుంచి బ‌న్నీకి విజ‌య్‌కి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఆ అనుబంధం కార‌ణంగానే త‌న మిత్రుడు ప్రొడ్యూస‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్న చిత్రాన్ని బ‌న్నీ సెట్ చేశాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All