Homeటాప్ స్టోరీస్గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిల‌కు వ‌ల‌!

గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిల‌కు వ‌ల‌!

గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిల‌కు వ‌ల‌!
గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిల‌కు వ‌ల‌!

ఇండ‌స్ట్రీలో గీతా ఆర్ట్స్ సంస్థ‌కు ప్ర‌త్యేక‌మైన పేరుంది. అందులో సినిమా చేయాల‌న్నా, ఆ సంస్థ‌ని ఒప్పించాల‌న్నా ద‌ర్శ‌కుల‌కు, రైట‌ర్‌ల‌కు క‌త్తిమీద సాము లాంటిది. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఈ సంస్థ నుంచి ఎన్నో హిట్‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికీ వ‌స్తూనే వున్నాయి. అలాంటి గీతా ఆర్ట్స్ పేరునే వాడుకుని అమ్మాయిల‌కు మోస‌గాళ్లు వ‌ల వేస్తుండ‌టం ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నంగా మారింది.

ఇటీవ‌ల హీరోయిన్ ఛాన్స్‌లిస్తామంటూ అమ్మాయిల‌కు వ‌ల వేసే ముఠాలు ఎక్కువైపోతున్నాయి. రీసెంట్‌గా
`Rx 100` ఫేమ్ అజ‌య్ భూప‌తి పేరుని వాడుకుంటూ హీరోయిన్ ఛాన్స్ ఇస్తామంటూ ఓ ముఠా అడ్డంగా దొరికిపోయిన ఉదంతం మ‌రువ‌క‌ముందే ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరుని వాడుకుంటూ ఓ ముఠా మోసాల‌కు పాల్ప‌డుతుండ‌టం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

- Advertisement -

గీతా ఆర్ట్స్‌లో తాను డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాన‌ని, బ‌న్నీ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ మోస‌గాడు అమ్మాయిల‌కు ఆన్‌లైన్ వేదిక‌గా వ‌ల వేయ‌డం మొద‌లుపెట్టాడ‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు వెంట‌నే సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని సంప్ర‌దించార‌ట‌. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆ కేటుగాడి ఆట‌క‌ట్టించేందుకు ఎంక్వైరీ మొద‌లుపెట్టిన‌‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All