Homeటాప్ స్టోరీస్బ్రిటీష్ నేపథ్యంలో ఎన్టీఆర్ చరణ్ ల సినిమా

బ్రిటీష్ నేపథ్యంలో ఎన్టీఆర్ చరణ్ ల సినిమా

british backdrop for ntr charans filmభారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు కథ తో ఎన్టీఆర్చరణ్ ల సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది . 1947 నాటి కథ మాత్రమే కాకుండా 1980 కాలం నాటి కథ కూడా అని తెలుస్తోంది అంటే మళ్ళీ పునర్జన్మ ల కథ అన్నమాట ! ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బ్రిటీష్ నేపథ్యం కూడా ఉంటుందట ఈ చిత్రానికి . ఎన్టీఆర్ – చరణ్ లకు మాస్ లో విపరీతమైన ఇమేజ్ ఉంది దాంతో ఈ ఇద్దరి ఇమేజ్ కి తగ్గట్లుగా సన్నివేశాలు , పాత్రల తీరు తెన్నులను తీర్చి దిద్దుతున్నాడట దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి .

బాహుబలి తో విశేష ప్రాచుర్యం పొందాడు జక్కన్న అలియాస్ రాజమౌళి . దాంతో అంతకు మించిన సినిమాని ఇవ్వాలి రాజమౌళి అందుకే మాస్ లో విపరీతమైన ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ – చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నాడు . భావోద్వేగాలు ఎంతగా కనెక్ట్ అయితే అంత పెద్ద హిట్ ని ఇస్తారు ప్రేక్షక దేవుళ్ళు అందుకే విభిన్నమైన అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడు రాజమౌళి . ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సమాయత్తం అవుతున్నాడు జక్కన్న . ముందుగా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు , ఆ తర్వాత చరణ్ ఎంటర్ అవుతాడు . ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా ” ఆర్ ఆర్ ఆర్ ” ని ఫిక్స్ చేసారు .

- Advertisement -

English Title: british backdrop for ntr charans film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All